Home » FIFA World Cup 2022 : అద్భుతమైన గోల్ తో రికార్డు సృష్టించిన మెస్సీ..!

FIFA World Cup 2022 : అద్భుతమైన గోల్ తో రికార్డు సృష్టించిన మెస్సీ..!

by Anji
Ad

ఖతార్ లో జరుగుతున్నటువంటి ఫిఫా ప్రపంచ కప్ లో భాగంగా అర్జెంటీనా పుట్ బాల్ స్టార్ లియోనల్ మెస్సీ రికార్డు  సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్ లో మెస్సీ ఒక అద్భుతమైన గోల్ కొట్టడంతో అర్జెంటీనా 2-1 తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో మెస్సీ ఇప్పటివరకు మూడు గోల్స్ సాధించాడు. వరల్డ్ కప్ నాకౌట్ దశలో అతనికి ఇది మొదటి గోల్. మరొక విశేషం ఏంటంటే.. ? ఈ మ్యాచ్ అతనికి 1000వ మ్యాచ్ కావడం విశేషం. ఓవరాల్ ప్రపంచ కప్ లో మెస్సీకి ఇది 9వ గోల్ కావడం విశేషం.

Advertisement

దీంతో ప్రపంచకప్ టోర్నీలలో అత్యధికంగా గోల్స్ చేసిన ఆటగాడిగా మెస్సీ చరిత్రకెక్కాడు. ఇంతకు ముందు డియోగో మారడోనా, క్రిస్టియానో రొనాల్డో చెరో ఎనిమిది గోల్స్ చేయగా.. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో గోల్ సాధించి, వారిద్దరి రికార్డులను మెస్సీ పటాపంచలు చేసాడు. అర్జెంటీనా తరుపున ఫిఫా ప్రపంచ కప్ లో అత్యధిక గోల్స్ చేసిన వారిలో గాబ్రియెల్ బటిస్టా 10 గోల్స్ లో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉండగా.. మెస్సీ, రొనాల్డోలో ఎవ్వరూ గొప్ప అనే చర్చ ఇప్పటికీ జరుగుతూనే ఉంటుంది. రొనాల్డో తన 1000 మ్యాచ్ ను 2020 లోనే పూర్తి చేయగా.. ఇప్పటివరకు అతడు 725 గోల్స్ సాధించి, మరో 216 గోల్స్ కు సహకరించాడు. మెస్సీ మాత్రం అతని కంటే ఎక్కువగానే గణాంకాలను నమోదు చేశాడు.

Advertisement

Also Read :  FIFA World Cup 2022 : క్వార్టర్ ఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చిన నెదర్లాండ్..!

ఇప్పటివరకు 789 గోల్స్ చేసి మరో.. 348 గోల్స్ కి సహకారం అందించాడు. ట్రోపీల పరంగానూ మెస్సీదే పై చేయి. రొనాల్డో ఖాతాలో 31 ట్రోపీలు ఉంటే మెస్సీ వద్ద 41 ఉన్నాయి. ఈ రికార్డుల పరంగా చూసుకుంటే రొనాల్డో కంటే మెస్సీనే మెరుగైన ఆటగాడిగా చెప్పుకోవచ్చు. ఈ టోర్నీలో సౌదీ అరేబియా చేతిలో పరాజయం చవిచూసిన అర్జెంటీనా నాకౌట్ మ్యాచ్ లో మాత్రం ఆస్ట్రేలియాను ఓడించి క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకుంది. క్వార్టర్స్ లో ఈ జట్టు నెదర్లాండ్స్ తో తలపడనుంది.  నెదర్లాండ్-అర్జెంటీనా మధ్య జరిగే ఆసక్తికరమైన మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.

Also Read :  ఈ 4గురు ఫుట్ బాల్ ప్లేయర్ల పారితోషకం తెలిస్తే.. ఆశ్చర్యపోవడం ఖాయం..!!

Visitors Are Also Reading