Home » FIFA World Cup 2022 : క్వార్టర్ ఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చిన నెదర్లాండ్..!

FIFA World Cup 2022 : క్వార్టర్ ఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చిన నెదర్లాండ్..!

by Anji
Ad

నెదర్లాండ్ జట్టు దాదాపు ఎనిమిదేళ్ల తరువాత ఫిఫా ప్రపంచకప్ కి తిరిగి వచ్చింది. వచ్చిన వెంటనే తన ప్రచారాన్ని కొనసాగించింది. ప్రధానంగా మేనేజర్ లూయిస్ వాన్ హాల్ జట్టు ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియంలో యునైటేడ్ స్టేట్స్ ని 3-1 తేడాతో ఓడించింది. ఇప్పటివరకు టోర్నమెంట్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఖతార్ ప్రపంచ కప్ లో నాకౌట్ ని బలంగా ప్రారంభించి క్వార్టర్ ఫైనల్ లోకి దూసుకెళ్లింది. ఫార్వర్డ్ డెంజెల్ డంఫ్రైస్ తన వైపు నుంచి స్టార్ అని నిరూపించుకున్నాడు. ముఖ్యంగా తొలి రెండు గోల్స్ కి మెరుపు పాస్ లు అందించిన డెంజెల్ ఆట ముగింపు దశలో స్వయంగా తానే గోల్ చేయడంతో నెదర్లాండ్స్ ఆధిక్యానికి ఎదురు లేకుండా పోయింది. 

Advertisement

టోర్నమెంట్ చివరి 16 రౌండ్ లోని మొదటి మ్యాచ్ ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగింది. ఇందులో గ్రూప్ ఏ అగ్రజట్టు నెదర్లాండ్ గ్రూప్ బీ రెండో ర్యాంకు యూఎస్ఏ ముఖాముఖీగా తలపడ్డాయి.  ప్రపంచ కప్ గ్రూప్ దశలో రెండు జట్లూ మంచి ప్రదర్శన కనబరిచి ఏ మ్యాచ్ లో కూడా ఓడిపోలేదు. గ్రూప్ లో తొలి స్థానంలో నిలిచినప్పటికీ నెదర్దర్లాండ్ ఆటతీరుపై ప్రశ్నలు తలెత్తాయి. వేగంగా ఎదుగుతున్న అమెరికన్ జట్టు నుంచి వారు గట్టి పోటీని ఎదుర్కుంటారని విశ్వసించారు. అంతకు ముందు డచ్ జట్టు 2-0 ఆధిక్యంలో నిచిలింది. అనువజ్ఞుడైన స్ల్రైకర్ మెంఫిస్ డిపే 10వ నిమిషంలో డెంజెల్ డంప్రైస్ అద్భుతమైన క్రాస్ ని అమెరికన్ గోల్ కీపర్ కి ఎడమవైపున కుడి వింగ్ బ్యాక్ గా గోల్ చేసి నెదర్లాండ్స్ ఖాతా ఓపెన్ చేశాడు.

Advertisement

FIFA World Cup: Netherlands beat US to reach quarter final | Deccan Herald

ప్రథమార్థం తరువాత ప్రారంభమైన తొలి నిమిషంలోనే నెదర్లాండ్ ఆదిక్యాన్ని రెట్టింపు చేసింది. మరోసారి వింగ్ బ్యాక్ డంఫ్రీస్ అద్భుతాలు చేశాడు. కుడి వింగ్ లో ఉన్న ఒక అమెరికన్ డిఫెండర్ ని అవుట్ ప్లే చేశాడు. గోల్ పోస్ట్ వైపు పాస్ ను కాల్చాడు. దానిని లెప్ట్ వింగ్ బ్యాక్ డాలీ బ్లెండ్ మార్చాడు. రెండవ అర్ధభాగంలో అమెరికా బలంగా పుంజుకునే ప్రయత్నం చేసి డచ్ గోల్ పై దాడి చేసింది. అతను చాలా సార్లు నెదర్లాండ్స్ డిఫెన్స్ ని తప్పించాడు. కానీ గోల్ కోసం నిరీక్షణ కొనసాగింది. చివరికీ శ్రమ ఫలించి 76వ నిమిషంలో స్టార్ వింగర్ క్రిస్టియన్ పులిసిక్ కొట్టిన బంతిని హాజీ రైట్ ఫ్లిక్ చేయడంతో గోల్ కీపర్ మీదుగా నెట్ లోకి వెళ్లడంతో స్కోరు 2-1 గా మారింది. అయితే 5 నిమిషాల తరువాత నెదర్లాండ్స్ మ్యాచ్ లో మూడో, చివరి గోల్ చేయడం ద్వారా అమెరికా పునరాగమనం ఆశలను ముగించింది. డాలీ బ్లైండ్ ఈసారి సహాయం చేశాడు. అప్పటికే రెండు అసిస్ట్ లు చేసిన డంఫ్రైస్ నిర్ణయాత్మక గోల్ చేసి జట్టుకు 3-1 తేడాతో విజయాన్ని అందించాడు. అర్జెంటీనా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో విజేతతో నెదర్లాండ్స్ క్వార్టర్ ఫైనల్ లో తలపడనుంది. 

Also Read : ఆసియా కప్ టోర్నీ నిర్వాహణపై ఉత్కంఠ.. జైషా వ్యాఖ్యలపై పీసీబీ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..?

Visitors Are Also Reading