ఏపీలో సినిమా టికెట్ల ధరల విషయంలో ఇప్పటికీ వివాదం కొనసాగుతూనే ఉంది. టికెట్ ధరలపై ఆంక్షలు విధించాడాన్ని టాలీవుడ్ లోని పలువురు ప్రముకులు తప్పుపడుతున్నారు. రీసెంట్ గా హీరో నాని చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా దుమారం రేగింది. దాంతో వైసీపీ మంత్రులు నానిపై ఫైర్ అయ్యారు. ఇదిలా ఉంటే తెలంగాణలో టికెట్ల ధరలను పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కండిషన్లు పెడుతూ తెలంగాణ సర్కార్ ధరలు పెంచుకునే అనుమతులు ఇచ్చింది.
Advertisement
దాంతో అటు థియేటర్లు ఇటు సినిమా ఇండస్ట్రీకి నష్టాలు వచ్చే అవకాశం లేకుండా పోయింది. అయితే ధరల పెంపు విషయంలో మెగాస్టార్ చిరంజీవి కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ ప్రభుత్వంతో చర్చించారు. ఎంపీసంతోష్, సినిమా మంత్రి తలసానిలతో చర్చలు జరిపి విషయాన్ని సీఎం దృష్టికి పంపించారు. ఇక కేసీఆర్ ధరలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చిరంజీవి కేసీఆర్ కు మరియు తలసాని, సంతోష్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన చిరంజీవి ఇప్పుడు ఏపీ సర్కార్ తో కూడా ధరల తగ్గింపు విషయమై చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మంత్రి పేర్ని నాని ద్వారా తన విన్నపాన్ని మెగాస్టార్ ఏపీ సర్కార్ ముందు ఉంచినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరి సర్కార్ చిరు రిక్వెస్ట్ పై ఎలా స్పందిస్తుందో చూడాలి.