మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టాలీవుడ్ లో చిరంజీవికి క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటి యంగ్ హీరోలు, నటులు ఎంతో మంది చిరంజీవిని ఆదర్శంగా తీసుకుంటారు. అయితే ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించారు చిరంజీవి. ఈ సందర్భంగా చిరంజీవి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందని రూమర్స్ వినిపించాయి. వెంటనే చిరంజీవి ఓ ట్వీట్ ద్వారా అసలు విషయాన్ని చెప్పి క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి ఏం మాట్లాడారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
తాను అలెర్ట్ గా ఉండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా non Cancerous Polyps డిటెక్ట్ చేసి వాటిని డాక్టర్లు తీసేశారు. ఏఐజీ ఆసుపత్రిలో ఓ వయస్సు దాటిన తరువాత కొలనోస్కోపీ చేయించుకున్నట్టు చెప్పారు చిరంజీవి. అయితే ఆ రిపోర్టులో తన శరీరంలోని పాలిప్స్ ను డాక్టర్లు గుర్తించినట్టు తెలిపారు. ఆ పాలిప్స్ ను వదిలేస్తే మాత్రం మెలాగ్లిన్ గా మారే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెప్పినట్టు వెల్లడించారు చిరంజీవి. దాదాపు 80 నుంచి 90 శాతం వరకు పాలిప్స్ మెలాగ్లిన్ గా మారే అవకాశముందని డాక్టర్లు చెప్పారని గుర్తు చేశారు. ముందుగా గుర్తించడంతో డాక్టర్లు పాలిప్స్ రిమూవ్ చేశారని.. ఈ అవగాహన లేకపోయి ఉంటే పరిస్థితి మరోవిధంగా ఉండేదని భయం వేసిందన్నారు.
Advertisement
తనకు అవగాహన ఉండటంతోనే ముందుకు వెళ్లి కొలనోస్కోపి చేయించుకున్నానని వివరించారు. అయితే ఈ విషయం చెప్పడానికి తాను భయపడటం లేదని వెల్లడించారు . క్యాన్సర్ ముందుగా గుర్తిస్తే పెద్ద జబ్బు కాదని పేర్కొన్నారు. అదేవిధంగా భగవంతుడు ఇస్తే ఏం చేయలేమని.. కానీ స్మోకింగ్ చేయడం, గుట్కాలు నమలడం వల్ల క్యాన్సర్ వస్తుందని వాటికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేవలం టిష్యులున్నాయని తాను చెబితే.. కొందరూ తనకు క్యాన్సర్ వచ్చినట్టు వార్తలు రాయడం పట్ల చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు విషయాన్ని అర్థం చేసుకోకుండా ఇలా రాయడం వల్ల చాలా మందిని భయబ్రాంతుల్ని చేసి బాధపెట్టిన వారవుతారని పేర్కొన్నారు చిరంజీవి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఉదయ్ కిరణ్ లాగే తరుణ్ కూడా డిప్రెషన్ లోకి వెళ్ళారా? ఆలస్యంగా నిజం వెలుగులోకి !
తేజ కథకు మొహం మీదే నో చెప్పిన పవన్… చివరికి ఆ హీరోతో తీస్తే బారీ ప్లాప్..!