ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మెగా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు చిరంజీవి. తెలుగు కమర్షియల్ సినిమా గురించి చెప్పాలంటే మొదట వినపడేది చిరంజీవి పేరే. 150 కి పైగా సినిమాల్లో నటించి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు చిరు. స్టైల్ తో డాన్స్ తో అందరిని ఆకట్టుకున్నారు చిరంజీవి. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీకి చాలామంది వచ్చారు. హీరోలు అవ్వాలని చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీకి ఇప్పుడు చాలా మంది వస్తూనే వున్నారు.
Advertisement
కేవలం సినిమా ఫీల్డ్ లోనే కాకుండా.. సొసైటీ లో కూడా చిరంజీవికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన వ్యక్తిత్వం, సాయం అందించే ఆయన మనసుకి చాలా మంది అభిమానులే ఉన్నారు. అయితే.. ఇండియాలోనే కాదు.. చైనాలో కూడా మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ వ్యాప్తి చెందుతోంది. గతంలో ఓసారి కేటీఆర్ జపాన్ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ మ్యూజియంలో చిరంజీవి ఫోటో చూసి ముగ్దులైన సంగతి విదితమే. తాజాగా మరో సంఘటన చిరంజీవి క్రేజ్ కు ప్రతిబింబంగా నిలుస్తోంది.
Advertisement
చైనా రాజధాని బీజింగ్ లో ఉండే జంజు 26 అనే ప్రభుత్వ మిడిల్ స్కూల్లో పిల్లలకు ఓ పోటీ పెట్టారట. వారిని వారికి నచ్చిన ఇన్స్పైరింగ్ పర్సన్ గురించి ప్రెజెంటేషన్ ఇవ్వాల్సిందిగా కోరారట. ఆ స్కూల్ లోనే ఏడవ క్లాస్ చదువే జస్మితా అనే అమ్మాయి మెగాస్టార్ చిరంజీవి గురించి తన ప్రెజెంటేషన్ ఇచ్చింది. అయితే అక్కడ భారతీయుల గురించి అనుమతి లేదు. ఈ విషయాన్నే ఆమె టీచర్ ప్రశ్నిస్తే.. ఆమె ఇంటర్నెట్ లో చిరంజీవి గురించి చూపిస్తూ బిగ్గెస్ట్ ఇన్స్పైరింగ్ పర్సన్ అని చెప్పడంతో చిరు గురించిన ప్రెజెంటేషన్ ఇవ్వడానికి అనుమతించారట. ఐదు నిమిషాల ప్రెజెంటేషన్ లో ఆమె కెరీర్ మొదటిలో ఎదుర్కొన్న కష్టాలు మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి జర్నీ గురించి వివరించిందట. జస్మితా తల్లితండ్రులు ఆంధ్రప్రదేశ్ అనకాపల్లికి చెందినవారు. చిరుని ఆదర్శంగా తీసుకున్న జస్మితా తండ్రి డాన్స్ లో రాణించి చైనా లో డాన్సింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టారు. ఇంటర్నేషనల్ గా రాణించిన ఆయినా గిన్నిస్ బుక్ లో రికార్డు కూడా కొట్టారు. జస్మితా తండ్రి విజయ్ గురించి తెలుసుకున్న మెగాస్టార్ ఆయనను ఇంటికి పిలిపించి మరీ అభినందించారు.
మరిన్ని..
“బోళా శంకర్” సినిమా అట్టర్ ఫ్లాప్… సుస్మిత పై ఫ్యాన్స్ సీరియస్ ?
అక్కినేని నాగార్జునకు రైతు బంధు…ఐఏఎస్ సంచలన వ్యాఖ్యలు
భోళా శంకర్ అట్టర్ ఫ్లాఫ్.. భారత్‌దే వరల్డ్ కప్.. ఇదే సెంటిమెంట్..!