మెగాస్టార్ చిరంజీవి ఖాళీగా ఉన్న సమయంలో తన పెరట్లో ఓ చిన్న ఆనపగింజను నాటారు. ఈ విత్తనం నుంచి చిన్న మొక్క బయటకు వచ్చి ఇంతింతై వటుడింతై అన్న చందానా మొక్క పెరిగి పెద్దదైంది. రెండు పెద్ద ఆనపకాయలు కాశాయి.
ఆ రెండు ఆనపకాయలను మెగాస్టార్ చిరంజీవి రైతు దినోత్సవం రోజున కోశారు. స్వయంగా నాటిన చిన్న విత్తనం నుంచి మొక్క వచ్చి కాయలు కాస్తే ఏదో తెలియని ఆనందం కలిగిందని, రైతు తాను పండించిన పంటపై ఎందుకు అంతటి మమకారం పెంచుకుంటాడో తనకు ఇప్పుడు అర్ధం అవుతుందని మెగాస్టార్ తెలిపారు. బయట కొన్న కూరగాయలను వండి తినడం కంటే ఇలా ఇంట్లో స్వయంగా పెంచిన మొక్కల నుంచి వచ్చిన కాయలను కోసుకొని వండుకొని తనడంలో ఉండే ఆనందం వేరు అని మెగాస్టార్ తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి ఇండ్లలో వీలైతే చిన్న మొక్కలు నాటి కాయగూరలు పండించుకోవాలని అన్నారు. కాగా, రైతు దినోత్సవం రోజున మెగాస్టార్ చేసిన చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Advertisement