Home » ఆ విషయంలో తానే గొప్ప అని చెప్పుకుంటున్న చిరు..!

ఆ విషయంలో తానే గొప్ప అని చెప్పుకుంటున్న చిరు..!

by Azhar
Ad
మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ ఆచార్య ఈ నెల 29న ముందుకు రాబోతుంది. దాంతో  రెండు రోజుల క్రితం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. అయితే అందులో చిరు తనను తానే గొప్పగా చెప్పుకోవడం ఇప్పుడు కొంత చార్చకు దారి తీసింది.
అయితే మాములుగా హీరోలు ఎవరు తమను తాము గొప్ప అని చెప్పుకోరు. తాను ఎంత గొప్ప గైలాగులు చెప్పిన.. గొప్పగా నటించినా అది దర్శకుడు కారణంగానే అని అంటుంటారు. అలాగే బాగా డ్యాన్స్ చేస్తే కొరియోగ్రాఫర్ వల్ల అని చెబుతుంటారు. కానీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం చిరు తానా డ్యాన్స్ గురించి గొప్పగా చెప్పుకున్నారు.
ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ లో ఎవరు బాగా డ్యాన్స్ చేసారు అనే ప్రశ్నకు… “నా పేరు శివశంకర వర ప్రసాద్. శివుడు అంటే డ్యాన్స్‌కి ప్రసిద్ధి. మరి శివుడి ముందు ఎవరైనా డాన్స్ చేయవచ్చా… చాలా మంది డ్యాన్స్ చేస్తున్నామని అనుకుంటారు. కానీ వారందరూ శివుడి తర్వాతే. అలాగే చిన్న హీరోలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది కాబట్టి, నేను నా డ్యాన్స్‌ను, నైపుణ్యాలను తక్కువ చేసుకుంటున్నాను అని చిరంజీవి పేర్కొన్నారు. అలా చిరంజీవి డ్యాన్స్‌లో తానే గొప్ప… అని ప్రకటించుకోవడం ఇప్పుడు చర్చకు దారి తీసుకుంది.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading