సినీ నటి మీన భర్త విద్యసాగర్ భర్తను కోల్పోయిన విషయం తెలిసిందే. విద్యాసాగర్ గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడ్డాడు. అయితే కరోనా బారిన పడి కోలుకున్నప్పటికీ ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో ఆయనను హాస్పిటల్‌లో చేర్పించారు. కొద్ది రోజులు ఐసీయూలో చికిత్స పొందిన ఆయనకు ఊపిరితిత్తుల ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని చెప్పారు. దాతలు లభించకపోవడంతో ఆపరేషన్ చేయలేకపోయారు. దీని ఫలితంగా ఆయన ఈ మధ్య కానరానిలోకాలకు వెళ్లారు. అయినప్పటికీ మీన భర్త మృతి చెందడం అందరినీ షాక్‌కు గురి చేసింది. సినీ ఇండస్ట్రీ పెద్దలు, సీనియర్ నటులు మీనను ఓదార్చారు.
Advertisement
మీన భర్త మృతి చెందడంతో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయనకు రూ.250 కోట్ల ఆస్తి ఉందని.. ఆస్తి తనకు దక్కడం లేదనే కారణంతోనే మీన తన భర్తను చంపించిందనే వార్తలు ప్రచారం చేశారు. ప్రధానంగా కోలీవుడ్ మీడియాల ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై స్పందించిన మీన తాను భర్తను కోల్పోయి బాధలో ఉన్నాను. దయచేసిన తనపై తప్పుడు వార్తలను అసలు ప్రచారం చేయవద్దని తనకు కాస్త ప్రైవసీ కల్పించాలని ఆమె ఇన్‌స్టా గ్రామ్ లో ఓ పోస్ట్ ద్వారా కోరింది. తాజాగా ఇప్పుడు మరొక విషయం వెలుగులోకి వచ్చింది.
Advertisement
మీన భర్త విద్యాసాగర్ తన ఆస్తినంతటిని మీన పేరిట రాయలేదట. మీన పేరిట కాకుండా తన కుమార్తె అయినటువంటి నైనిక పేరుమీద రాశారట. ముఖ్యంగా మీనాకు ఒక్కరూపాయి కూడా దక్కకుండా వీలునామా రాశారట. నైనిక మేజర్ అవ్వగానే ఆమెకు, ఆమె భర్తకు ఆస్తి చెందేవిదంగా ఆయన వీలునామాలో పేర్కొన్నారట. దీంతో మీనాపై పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ సృష్టిస్తున్నాయి. నైనిక మేజర్ అయ్యేంత వరకు గార్డియన్‌గా ఉండేవారు ఆస్తిని చూసుకోవాలని వీలునామాలో రాసి ఉందట. ఇవన్నీ మాత్రం సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు కావడంతో ఇందులో వాస్తవం ఎంత ఉందనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read :
మహేశ్ బాబు త్రివిక్రమ్ లకు పూజా హెగ్డే కండిషన్స్…అవేంటంటే..!
ఆచార్య వల్ల ఆస్తులు అమ్ముకున్న కొరటాల..బయ్యర్లకు అన్ని కోట్లు ఇచ్చేశారట..!