Home » Meena : ఏది జరగాలో అదే జరుగుతుంది.. రెండో పెళ్లిపై స్పందించిన మీనా..!

Meena : ఏది జరగాలో అదే జరుగుతుంది.. రెండో పెళ్లిపై స్పందించిన మీనా..!

by Sravya
Ad

Meena  : చాలా మంది హీరోయిన్లు పెళ్లి తర్వాత సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తూ ఉంటారు. నటి మీనా కెరీయర్ ని అద్భుతంగా రూపొందించుకున్నారు. అయితే ఈమె భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో చనిపోవడంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ విషాదం నుండి తేరుకుని మళ్ళీ మామూలు పరిస్థితుల్లోకి వచ్చారు. దాని నుండి బయట పడడం ఆమెకు చాలా కష్టం అయ్యింది. తాజాగా రెండవ పెళ్లి చేసుకుంటారని వార్తలపై స్పందించింది. నా భర్త దూరం అవుతారని అనుకోలేదు. ఆ పరిస్థితుల నుండి బయట కి రాలేకపోయాను.

meena-marriage

Advertisement

 

రెండో పెళ్లి వార్తలు ఒకపక్క ఆమెని మరింత బాధించాయి. హీరో ధనుష్ తో అఫైర్ కొనసాగిస్తోంది అని మీడియాలో ఒక వార్త వచ్చింది. ధనుష్ తో నాకు సంబంధం అంటగట్టడం దురదృష్టకరమని ఆమె చెప్పారు. నాకు ఒక ఫ్యామిలీ ఉంది. ఒక కూతురు ఉంది. మేము విషాదంలో ఉన్నాము. బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇటువంటప్పుడు ఈ వార్తలు రావడం బాధాకరమని మీనా అన్నారు.

Also read:

Advertisement

Also read:

జీవితంలో ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో చెప్పలేము. నా భర్త చనిపోతాడని ఏ క్షణంలో కూడా ఊహించలేదు. మనిషి జీవితంలో ఏది జరగాలో అదే జరుగుతుంది అని మీనా తన రెండవ పెళ్లి పై స్పందించారు. ఇది చేద్దామని ప్లాన్ చేసుకుంటే కుదరదు. నా లైఫ్ లో కూడా అంతే. నేను ప్రస్తుతం దేని గురించి ఆలోచించట్లేదు అని మీనా చెప్పారు. భర్త చనిపోతే భార్య రెండో పెళ్లి చేసుకోవాల్సిందేనా..? ఎంతమంది ఒంటరిగా జీవితాన్ని గడపట్లేదు..? నేను కూడా అంతే. ప్రస్తుతం ఒంటరిగానే ఉన్నాను. సాధ్యమైనంత దాకా ఒంటరిగానే జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తాను అని మీనా అన్నారు. అలానే నా కూతురు నైనిక విద్యాసాగర్ భవిష్యత్తు కూడా నాకు చాలా ముఖ్యమని మీనా అన్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading