Home » యూట్యూబ్ లో క్లాసులు విని మెడిసిన్ సీటు సాధించింది..!!

యూట్యూబ్ లో క్లాసులు విని మెడిసిన్ సీటు సాధించింది..!!

by Sravanthi
Ad

చాలామంది యూట్యూబ్ అంటే పాటలు, ఇతర వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది సినిమాలు, కామెడీ వీడియోలు చూస్తూ ఉంటారు. కానీ ఈ అమ్మాయి మాత్రం యూట్యూబ్ వాడింది కానీ సరదా కోసం అయితే కాదు… తను జీవితంలో అనుకున్నది సాధించడం కోసం.. తన గోల్ నెరవేర్చుకోవడం కోసం ఇంతకీ ఆమె యూట్యూబ్ ద్వారా ఏం చేసిందయ్యా అంటే.. యూట్యూబ్ లోనే క్లాసులు విని ఏకంగా ఎంబిబిఎస్ సీటు సాధించింది. రాష్ట్రస్థాయిలో 700ర్యాంకు సాధించింది.

Advertisement

నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవ్ వాడకు చెందిన సతీష్ కుమార్ అనురాధ కుమార్తె హారిక.చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి బీడీ కార్మికురాలుగా పనిచేస్తూ వచ్చింది. ఎంతో కష్టపడి కూతురును చదివించింది. కూతురు కూడా ఆ విధంగానే చదువులో చురుగ్గా ఉండేది. పదో తరగతిలో 9.5 జిపిఏ, ఇంటర్ లో 942 మార్కులు సాధించింది. ఇంటర్ తర్వాత నీట్ లో ర్యాంక్ సాధించడమే లక్ష్యంగా ఇంట్లోనే యూట్యూబ్ లో వీడియో క్లాసులు వింటూ పరీక్షకు సిద్ధమైంది..

Advertisement

also read:భైర‌వ‌ద్వీపం సినిమా విడుద‌ల స‌మ‌యంలో అంత ర‌చ్చ జ‌రిగిందా..? ఏకంగా సెన్సార్ వాళ్లు వార్నింగ్ ఇచ్చినా.?

నిట్ జాతీయస్థాయిలో 40 వేల ర్యాంక్, రాష్ట్రస్థాయిలో 700ర్యాంక్ సాధించింది. హైదరాబాదులోని ఓ కాలేజీలో సీటు వచ్చినప్పటికీ, కుటుంబా ఆర్థిక బలహీనత వల్ల ఫీజు కట్టలేక ఇంట్లోనే ఉండిపోయింది. అయితే హారిక పరిస్థితి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆమె చదువు బాధ్యతను పూర్తిగా తానే తీసుకుంటానని, ఎంబిబిఎస్ చదువు అయ్యే వరకు ఖర్చును తాను భరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఎమ్మెల్సీ కవిత కూడా హారికాను ఆర్థికంగా ఆదుకుంటానని ఇటీవల భరోసా ఇచ్చారు.

also read:

Visitors Are Also Reading