Home » కామన్వెల్త్ గేమ్స్ నుండి తప్పుకున్న నీరజ్ చోప్రా..!

కామన్వెల్త్ గేమ్స్ నుండి తప్పుకున్న నీరజ్ చోప్రా..!

by Azhar
Ad

మన ఇండియాలో క్రికెట్ అనేది చాలా పెద్ద గేమ్. అందుకే ప్రజలకు కూడా ఈ క్రికెట్ కు సంబంధిన ఆటగాళ్ల గురించే ఎక్కువగా తెలుసు. ఈ క్రికెట్ ఆటగాళ్లకు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. కానీ మిగితా వేరే వేరే క్రీడా రంగాలకు చెందిన వారు కూడా కొంత మంది తెలుసు. అలాంటి వారిలో నీరజ్ చోప్రా కూడా ఉంటాడు. 2018 లో జరిగిన ఆసియా గేమ్స్ లో స్వర్ణం సాధించి దేశ ప్రజలకు తన పేరును పరిచయం చేసిన నీరజ్ చోప్రా.. ఆ తర్వాత తాజాగా జరిగిన టోక్యో ఒలంపిక్స్ లో కూడా జావెలిన్ త్రోలో గోల్డ్ సాధించి ప్రపంచానికి తనను తాను పరిచయం చేసుకున్నాడు.

Advertisement

100 ఏళ్లుగా ఇండియా ఎదురు చూస్తున్న అథ్లెటిక్స్ గోల్డ్ మెడల్ ను నీరజ్ చోప్రా ఇండియాకు అందించాడు. అందువల్ల అతని పేరు మొత్తం మారుమ్రోగిపోయింది. అయితే తన ఫామ్ ను అలాగే కొనసాగిస్తూ… తాజాగా ముగిసిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో కూడా ఇండియా యొక్క 19 ఎల్లా నిరీక్షణకు తెర దించాడు. జావెలిన్ త్రో ఫైనల్స్ లో రజత పథకం అందుకున్నాడు. అందువల్ల నీరజ్ ఎక్కడికి వెళ్లినా అక్కడ పాతరం తెస్తాడు అని అందరూ ఫిక్స్ అయ్యారు. అలాగే ఈ ఏడాది ఇంగ్లాండ్ లో జరగబోతున్న కామన్వెల్త్ గేమ్స్ లో కూడా నీరజ్ మెడల్ తెస్తాడు అని అనుకున్నారు.

Advertisement

కానీ ఈ విషయంలో తాజాగా దేశ ప్రజలకు నీరజ్ చోప్రా షాక్ ఇచ్చాడు. ఈ కామన్వెల్త్ గేమ్స్ నుండి నీరజ్ చోప్రా తప్పుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఇండియా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహాతా వెల్లడించారు. అయితే నీరజ్ ఇప్పుడు ఫిట్ గా లేడు అని అందుకే అతను పక్కకు తప్పుకున్నాడు అని పేర్కొన్నాడు. అయితే నీరజ్ సిల్వర్ గెలిచిన.. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ ఫైనల్స్ లో గాయపడ్డాడు. ఈ విషయాన్ని అతను కూడా చెప్పాడు. ఫైనల్స్ లో నాలుగో త్రో తర్వాత తన తొడ కండరాలు పట్టేశాయని.. అందుకే మిగిలిన రెండు త్రోలు సరిగ్గా వేయలేదు అని చెప్పాడు.

ఇవి కూడా చదవండి :

వన్డే ఫార్మట్స్ లో ఓవర్లను కుదించనున్నారా…?

నిండు గ‌ర్భిణీ అయిన‌ప్ప‌టికీ ఒలింపియాడ్ బ‌రిలో హారిక‌

Visitors Are Also Reading