Home » చనిపోయిన వారు పదే పదే కలలో కనిపిస్తున్నారా? అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి!

చనిపోయిన వారు పదే పదే కలలో కనిపిస్తున్నారా? అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి!

by Srilakshmi Bharathi
Ad

మనకి కలలు వస్తుండడం సహజమే. అయితే కొన్ని కలలు మనకి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మనకి బాగా ఇష్టమైన వారు దురదృష్టవశాత్తూ దూరం అయితే.. మన బాధ వర్ణనాతీతం. వారిని తలుచుకుంటూ గడిపేస్తూ ఉంటాము. వారు మనకి కలలో కనిపిస్తే అలా అయినా వారిని చూసాం అన్న సంతోషాన్ని పొందుతాము. అయితే.. చనిపోయిన వారు మన కలలలో కనిపిస్తే దాని అర్ధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

dreams

Advertisement

ఇలా చనిపోయిన వారు కలలో కనిపించినా, పాములు కలలో కనిపించినా వారికి పూర్వీకుల ఆశీస్సులు ఉన్నాయని అర్ధమట. ఎవరైనా యాక్సిడెంట్ లేదా ఏదైనా ప్రకృతి వైపరీత్యం కారణంగా కాకుండా.. సహజసిద్ధంగా మరణం పొందితే వారికి కూడా పూర్వీకుల ఆశీస్సులు బాగున్నాయని అర్ధం. చనిపోయిన వారు కలలో ఆనందంగా ఉన్నట్లు, ఆశీర్వదిస్తున్నట్లు మీకు కనిపిస్తే మీకు రాబోయే కాలంలో మంచి జరుగుతుంది.

Advertisement

మీరు ఏదైనా పనిని పూర్తి చేయాలని అనుకున్నప్పుడు ఎవరైనా పెద్దలు ఆ కార్యం పూర్తి చేయడానికి మీకు సాయం అందిస్తే.. మీ పూర్వీకుల ఆశీర్వచనాలు వల్లే ఇది సాధ్యమైంది అని భావించాలి. తల్లి తండ్రులను, తోడబుట్టిన వారిని సరిగ్గా చూసుకునే వారికి కూడా చనిపోయిన పూర్వీకుల ఆశీస్సులు ఉంటాయట.

మరిన్ని ముఖ్యమైన వార్తలు :

భార్య ప్రెగ్నెన్సీ సమయంలో భర్త చేయాల్సిన పనులు…ఆ పని తప్పా!

ఈ 4 లక్షణాలు కనుక భార్యలో ఉంటే.. భర్త పరాయి ఆడదాని స్వాధీనమైనట్లే..!

మీ భార్య గొడవ పడితే ఇలా కూల్ చేయండి !

Visitors Are Also Reading