ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. కరోనా వల్ల అనాథలైన పిల్లలకు నెలకు రూ.4 వేలు ఇస్తామని ప్రకటించారు. వాటికి 23 ఏళ్లు నిండిన తర్వాత వారి ఖాతాల్లో రూ.10 లక్షలు జమ అవుతాయని చెప్పారు.
Advertisement
ఏపిలోని సెక్రటేరియట్ సమీపం లో ఉన్న అన్న క్యాంటీన్ ను దుండగులు ద్వంసం చేశారు. క్యాంటీన్ గోడలను పగలగొట్టి ఇటుకలను తొలగించారు. గతంలో ఈ క్యాంటీన్ ను చంద్రబాబు ప్రారంభించారు.
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,338 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా గడిచిన 24 గంటల్లో కరోనా తో 19 మంది మృతి చెందారు.
సోనియా గాంధీ దేశద్రోహి అంటూ కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. సోనియా తెలంగాణ తల్లి కాదని దేశద్రోహి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్లు రావని అన్నారు.
నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్‌లో ఏపీ, తెలంగాణ మత్స్యకారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలురాళ్లు రువ్వుకున్నాయి. రింగ్ వలలు వేయవద్దని తెలంగాణ మత్స్యకారులు డిమాండ్ చేయడం తో ఘర్షణ చోటు చేసుకున్నట్టు సమాచారం.
Advertisement
హైదరాబాద్ పంజాగుట్టలో తెలుగు టీవీ నటి మైథిలీ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దాంతో వెంటనే ఆమెను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తన భర్తపై పోలీసులు చర్యలు తీసుకోవాలని మైథిలీ డిమాండ్ చేసింది.
తెలంగాణలో జూన్ 3 నుంచి 30 వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నారు. జూన్ 13న పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. జూన్ 14 నుంచి 30 వరకు ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ రేపు హైదరాబాద్ కు రానున్నారు షాద్‌నగర్‌లో సభ్యత్వ నమోదు కో ఆర్డినేటర్లతో సమావేశం కానున్నారు. జూన్ 1న చింతన్ శిబిర్‌లో మాణిక్యం ఠాగూర్ పాల్గొంటారు.
రుతుపవనాల ప్రభావంతో పశ్చిమ దిశ నుంచి తెలంగాణకు గాలులు వీస్తున్నాయి. వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరశాఖ హెచ్చరించింది.
గత రాత్రి సీఎం జగన్ దావోస్ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్నారు. రాత్రి 12:50 కి సీఎం గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.