ఏ పెళ్లికి వచ్చినా అతిధులైనా ఆసక్తిగా ఎదురు చూసేది భోజనం కోసమే. ప్రస్తుతం అందరి దృష్టి విక్కీ, కత్రినా పెళ్లి పైనే ఉంది. పెళ్ళికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకోవాలని అభిమానులు తహతహలాడుతున్నారు.
కత్రినా, విక్కీ పెళ్ళి విందు
విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లిలో కచోరి, దహీ భల్లే, ఫ్యూజన్ చార్ట్ ఉంటాయి. ఇంకా కబాబ్స్, ఫిష్ ప్లేట్ ఉన్నాయి. సాంప్రదాయ రాజస్థానీ వంటకాలు దాల్ బాటి చుర్మా, ఇది దాదాపు 15 రకాల పప్పులతో తయారు చేయబడుతుంది. నీలం-తెలుపు టిఫనీ కేక్ ఉంటుంది. దీనిని ఇటలీ చెఫ్‌లు ప్రత్యేకంగా తయారు చేస్తారు. గోల్గప్ప, పాన్, భారతీయ వంటకాల విభిన్న స్టాల్స్ ఉన్నాయి. అంతే కాకుండా అన్యదేశ వంటకాలను కూడా ఆహారంలో చేర్చనున్నారు.
Advertisement
Advertisement
పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ వేడుక నేటి నుండి ప్రారంభమైంది. హల్దీ, మెహందీ, సంగీతం అన్నీ గ్రాండ్‌గా ఉంటాయి. పెళ్లికి రాలేని వారి కోసం ముంబైలో విక్కీ, కత్రినా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ డిసెంబర్ 9 న వివాహం చేసుకోబోతున్నారు. వివాహానికి 120 మంది అతిథులు హాజరుకానున్నారు. దీంతో పాటు పెళ్లికి వచ్చే అతిథి కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఏ అతిథి కూడా తమ ఫోన్లలో వివాహ ఫోటోలు, వీడియోలను తీయకూడదు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయకూడదు. ఇక విక్కీ, కత్రినా కుటుంబం గత రాత్రి సిక్స్ సెన్సెస్ బర్వారా కోటకు చేరుకున్నారు.