జగిత్యాల జిల్లాలో ఓ విచిత్రమైన, ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. ఓ యువతికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. పెళ్లి తేడీ కూడా ఫిక్స్ చేసి బంధువులందరికీ పెళ్లికి ఆహ్వాన పత్రికలు పంచారు. మేళతాళాలు, వేదమంత్రాలతో పెళ్లి చేయాలని భావిస్తే.. ఆ యువతి తల్లిదండ్రులకు సొంత అక్కకు ఇచ్చిన షాక్ స్థానికంగా ఉన్నవారిని బంధువులందరినీ నివ్వెరపోయేలా చేసింది. ఇంతకు ఆ యువతి ఏం చేసింది ? అసలు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : అతడికి 23 నాకు 35 ఇది మా స్టోరీ..! మా సమస్యకి పరిష్కారం చెప్పగలరా ?
Advertisement
జగిత్యాల జిల్లా కన్నపూర్ మండలానికి చెందిన యువతిని లంబాడి పల్లికి చెందిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దల సమక్షంలో నిశ్చయించారు. మే 07 ఆదివారం వీరి పెళ్లి జరగాల్సి ఉంది. కానీ కొద్ది సేపట్లో పెళ్లి జరుగుతుందనే సమయంలో పెళ్లి కూతురు మాయమైంది. వధువు ఎక్కడికి వెళ్లిందో అర్థంకానీ బంధువులు ఆమె కోసం వెతుకుతుండగా.. వధువు అక్క భర్త కూడా అదృశ్యం కావడంతో అందరనీ నిర్ఘాంతపోయేవిదంగా చేసింది. పెళ్లి కూతురు ఎక్కడికి వెళ్లింది.. పెళ్లి కూతురు అక్క భర్త కూడా కనిపించకుండా ఎటు వెళ్లాడు ? అని ఆరా తీశారు. దీంతో బావతో కలిసి పెళ్లి కూతురు జంప్ అయిందని తెలిసి షాక్ కి గురయ్యారు.
Advertisement
Also Read : కృష్ణ తో పోల్చుకుని నా స్థాయిని నేను దిగజార్చుకోను అంటూ ANR ఎందుకు అన్నారు ?
వాళ్ల వెతికినప్పటికీ వారి ఆచూకి మాత్రం లభించలేదు. పెళ్లి చేసుకుందామని ఆశపడిన పెళ్లికొడుకు యువతి ఇచ్చిన షాక్ కి లబోదిబోమంటున్నాడు. తనను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే ముందే చెప్పినా బాగుండు. తీరా మరికొద్దిసేపట్లో పెళ్లి అనగా ఇలా చేయడం ఏంటి అని బాధపడుతున్నాడు. సొంత చెల్లెలే తన భర్తను తీసుకొని వెళ్లి పోవడాన్ని ఆ అక్క జీర్ణించుకోలేకపోతుంది. తన భర్తతో పాటు తన చెల్లెలు చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తమ చిన్న కుమార్తె చేసిన పనికి తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. తమ ఇద్దరూ కూతుళ్ల జీవితం ఎలా అని బాధపడుతున్నారు. రోజు రోజుకు బంధాలకు, అనుబంధాలకు అర్థం లేకుండా పోయిందని పలువురు పేర్కొనడం గమనార్హం.
Also Read : Alekhya Reddy:తారకరత్న పోయి 3నెళ్లు కాలేదు..అలేఖ్య రెడ్డి 2 పెళ్లిపై క్లారిటీ..!!