Home » Mar 16th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Mar 16th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

నేడు సీఎం జగన్ ఢిల్లీకి వెళుతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు.

Advertisement

 

ఏలూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి కవురు శ్రీనివాస్‌కు 481, వంకా రవీంద్రకు 460 ఓట్లు వచ్చాయి.

 

 

సీఎం జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ అయ్యింది. మంత్రి వర్గం బడ్జెట్‌ను ఆమోదించనుంది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

 

వరంగల్‌లో రెండో రోజు ఐటీ దాడులు జరుగుతున్నాయి. బాల వికాస్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ హార్డ్‌ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. 15 మంది బృందంతో అకౌంట్స్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు. బాలవికాస్‌ నిర్వాహకులు, సిబ్బంది మొబైల్స్‌ ను ఐటీ అధికారులు సీజ్ చేశారు.

 

 

ఉమ్మడి ఆదిలాబాద్‌లో నేటి నుంచి భట్టి విక్రమార్క పాదయాత్ర జరుగుతోంది. పిప్రీ గ్రామం నుంచి భట్టి పాదయాత్ర ప్రారంభం కానుంది. ఆదిలాబాద్‌ జిల్లాలో 240 కిలోమీటర్ల వరకు భట్టి యాత్ర కొనసాగనుంది. ఏప్రిల్ 2 న లక్ష మందితో మంచిర్యాల లో భారీ సభను నిర్వహించనున్నారు.

Advertisement

తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో కొత్తగా 54 కరోనా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోనే 40 కరోనా కేసులు నమోదయ్యాయి.

 

కేంద్ర ఎన్నికల కమిషనర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు, కోడ్ ఉల్లంఘనలు, బోగస్ ఓట్లు, ఎలక్షన్ అధికారులు అధికార దుర్వినియోగం చేశారంటూ బాబు లేెఖలో పేర్కొన్నారు.

 

 

హైదరాబాద్ లో బీజేపీ నేత బీఎల్ సంతోష్ పోస్టర్ల కలకలం రేగింది. బీఎల్ సంతోష్ కనబడుట లేదు అంటూ హైదరాబాద్ సిటీలో పోస్టర్లు వెలిశాయి. ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్ధహస్తుడు అని పోస్టర్లలో పేర్కొన్నారు.

 

అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసింది. ఈ నెల 5 న ఈ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే.

Visitors Are Also Reading