మంచు మనోజ్ గత కొద్దిరోజులుగా వార్తల్లో హాట్ టాపిక్ గా మారిన పేరు. మోహన్ బాబు నటవారసుడుగా మనోజ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మనోజ్ నటన అతడి ఆటిట్యూడ్ నచ్చడంతో ఫ్యాన్ బేస్ ఏర్పడినా కూడా సరైన కథలను ఎంచుకోవడంలో తడబడ్డాడు. దాంతో స్టార్ హీరో అవ్వాల్సిన మనోజ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణించడానికి తంటాలు పడుతున్నాడు. ఇక మనోజ్ పర్సనల్ లైఫ్ లో ఉన్న ఇబ్బుందులు కూడా అతడిని వెనక్కినెట్టేసేలా చేశాయి.
Advertisement
మనోజ్ ప్రణతి రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా గతేడాది తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్టు మనోజ్ ప్రకటించాడు. అప్పటి నుండి సినిమాలకు దూరంగా ఉన్నాడు. త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ ను ప్రటిస్తానని చెప్పాడని కానీ అలా చేయలేదు. ఇక మనోజ్ రీసెంట్ గా భౌమా మౌనికా రెడ్డితో హైదరాబాద్లో ఓ గణేష్ మండపం వద్ద మీడియా కంటపడ్డాడు. దాంతో అప్పటి నుండి వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Advertisement
అంతే కాకుంకా మనోజ్ మౌనికా రెడ్డి ప్రస్తుతం కలిసి ఉంటున్నట్టుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో విడాకుల తరవాత మనోజ్ రెండో పెళ్లికి రెడీ అవ్వగా మొదటి భార్య ప్రణతి రెడ్డి ఎలా ఉంది ప్రస్తుతం ఏం చేస్తుంది అని నెటిజన్లు తెగవెతికేస్తున్నారు. విడాకుల తరవాత ప్రణతి రెడ్డి అమెరికాకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.
ప్రణతి ఇల్యూస్ట్రేషన్ ఆర్టిస్ట్ కాగా అమెరికాలో సింగిల్ గానే ఉంటున్నట్టు సమాచారం. ఇక ప్రణతి రెడ్డి మనోజ్ లు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రణతి రెడ్డి మనోజ్ వదిన విరోనికకు దగ్గరి బంధువు మరియు స్నేహితురాలు కూడా. పెద్దలను ఒప్పించి మనోజ్ ప్రణతి పెళ్లి చేసుకోగా మనస్పర్దలు రావడంతో విడాకులు తీసుకున్నారు.