మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కేంద్ర ప్రభుత్వంపై మోడీపై విమర్శలు కురిపించారు. మోడీ ప్రభుత్వం మతాల మధ్య ద్వేశాలను పెంచుతుందని ప్రజలను విభజించి పాలించాలని చూస్తోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అదే అంటూ ఆరోపించారు. ఫిబ్రవరి 20 పోల్స్ ప్రకారంగా….ఇండియా సరిహద్దుల్లో చైనా సైనికులు కాచుకు కూర్చున్నారని అన్నారు. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. ప్రజలు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సమస్యలను ఎదుర్కొంటున్నారని… మరోవైపు ఏడున్నరేళ్ల నుండి అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం తప్పులను అంగీకరించి సరిదిద్దుకోవడానికి బదులుగా ప్రజా సమస్యల విషయంలో తొలి ప్రధాని జోహార్ లాల్ నెహ్రూను నిందిస్తున్నారని మన్మోహన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ తప్పులకు ప్రాధాన్యత తగ్గించుకోవడానికి చరిత్రను నిందించడం కంటే ప్రధాని హుందాగా వ్యవహరించాలని అన్నారు. తాను ప్రధానమంత్రిగా ఉన్న పదేళ్ళకాలంలో పన్నుల ద్వారా మాట్లాడానని చెప్పారు. ప్రపంచం ముందు దేశం పరువు పోయేలా చేయలేని అన్నారు. బలహీనుడు, మౌన ముని, అవినీతిపరుడు అంటూ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఇప్పుడు బిజెపి దాని బి, సి ల బండారం దేశం ముందు బయటపడుతుందనే అసంతృప్తి తనకు ఉందని తెలిపారు.
Advertisement
Advertisement
బిజెపి ప్రభుత్వానికి ఆర్థిక విధానం పై అవగాహన లేదని మన్మోహన్ సింగ్ ఆరోపించారు. బీజేపీ ఈ దేశానికి పరిమితమైన సమస్య కాదని అన్నారు. విదేశాంగ విధానంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. బిర్యాని తినిపించడం ద్వారా విదేశాంగ విధానాన్ని నిర్వహించడం సాధ్యం కాదని మోడీ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా అంటూ ఆరోపించారు. బిజెపి ప్రభుత్వానిది బూటకపు జాతీయవాదం అని విభజన విధానమని మన్మోహన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
also read : విజయశాంతి భర్త ఎవరో తెలుసా..? బాలయ్య- విజయశాంతి మధ్య ప్రేమ నిజమేనా..?
స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం తాము ఎన్నడూ దేశానికి ఉపయోగించుకోలేదని అన్నారు. ఈ ప్రభుత్వ బూటకపు జాతీయవాదం ప్రమాదకరమన్నారు. జాతీయ వాదానికి ఆధారం విభజించు పాలించు అనే బ్రిటిషు నినాదం అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుత ఆర్థిక విధానంలో స్వార్థం…. దురాశ ఉన్నాయని ఆరోపించారు. వారి ప్రయోజనాల కోసం దేశ ప్రజలను విడగొడుతున్నారని ఆరోపించారు.