Home » పెళ్లికి ముందు అమ్మాయి, అబ్బాయికి మంగళ స్నానం ఎందుకు చేయిస్తారంటే..?

పెళ్లికి ముందు అమ్మాయి, అబ్బాయికి మంగళ స్నానం ఎందుకు చేయిస్తారంటే..?

by Sravanthi
Ad

పూర్వకాలం నుంచి పెళ్లి చేసుకునే అమ్మాయి గానీ అబ్బాయి గానీ మంగళ స్నానం అనేది చేయిస్తూ ఉంటారు.. ఇది ఇప్పుడు వచ్చిన ఆచారం కాదు మన తాతల నాటి నుంచి కొనసాగుతూ ఉన్న సాంప్రదాయం.. మరి ఈ సాంప్రదాయం ప్రస్తుత జనరేషన్ కు పెద్దగా నచ్చకపోవచ్చు. కానీ ఈ మంగళ స్నానం వెనుక బోలెడంత సైన్స్ ఉందని తప్పనిసరిగా తెలుసుకోవాలి..

Advertisement

also read:అతిపిన్న వయసులోనే ఫిఫాలో 9 గోల్స్.. పీలే రికార్డును బ్రేక్ చేసిన ఆటగాడు ఎవరంటే? 

మన పెద్దలు ఏదైనా ఊరికే చెప్పరు.వారి నుంచి వచ్చిన ఏ పనిలో అయినా పూర్వాపరాలు వెతికితే దాని వెనుక పెద్ద సైన్స్ దాగి ఉంటుంది. అలాంటిది మంగళ స్నానంలో కూడా మన శరీరానికి మేలు పనులు అనేకం ఉన్నాయి.. మరి మంగళ స్నానం చేస్తే జరిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం.. మంగళ స్నానానికి పసుపు, నూనె, కుంకుడుకాయలు, నలుగు పిండి వాడతారు. పెళ్లి లేదా ఏదైనా శుభకార్యం జరిగే సమయంలో మనసు చాలా ఒత్తిడికి గురవుతుంది.

Advertisement

ఆ ఒత్తిడి నుంచి కాస్త రిలాక్స్ కావడం కోసమే ఈ మంగళ స్నానం చేయిస్తారు. ముందు తలకి ఒంటికి నూనె రాసి, ఆ తర్వాత పసుపు రాసి, నలుగు పెడతారు. నలుగు పెట్టి అభ్యంగన స్నానం చేయించడం వల్ల చర్మం పైన ఉన్న డెడ్ సెల్స్ తొలిగిపోతాయి. కుంకుడుకాయలతో తల అంటడం వల్ల హెడ్ మసాజ్ అవుతుంది. పసుపు యాంటీబయోటిక్ గా పనిచేస్తుంది.. దీనివల్ల మొహంలో కానీ శరీరంలో కానీ కాంతి పెరిగి పెళ్లికళ వచ్చింది అని అంటుంటారు.

also read:

Visitors Are Also Reading