సినీ ఇండస్ట్రీలో మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మంచు ఫ్యామిలీలో ఎటువంటి ట్రోల్స్ ఎదురుకొని ఏకైక నటుడిగా కూడా ఈయన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్న మంచు మనోజ్, మౌనిక రెడ్డి ఎట్టకేలకు రూమర్లకు తెరదించుతూ నిన్న రాత్రి ఫిలింనగర్ లో 8:30 గంటల సమయంలో మంచు లక్ష్మీ నివాసంలో వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు.
read also : సీఎం కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం !
Advertisement
అయితే ఈ పెళ్లి మంచు మోహన్ బాబుకు ఇష్టం లేదని, అందుకే మంచు మనోజ్ కుటుంబానికి దూరంగా ఉంటున్నారు అంటూ ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారానికి బ్రేకులు వేస్తూ మోహన్ బాబు దంపతులు మంచు మనోజ్, మౌనిక రెడ్డి పెళ్లిలో సందడి చేశారు. నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. అయితే మౌనికను ఆశీర్వదిస్తున్న సమయంలో మౌనిక ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయిపోయింది.
READ ALSO : సోషల్ మీడియాలో ఫస్ట్ నైట్ వీడియో… అది చూసిన భార్య ఏం చేసిందంటే?
Advertisement
వాస్తవానికి మోహన్ బాబు, భూమా నాగిరెడ్డి ఫ్యామిలీలు మంచి స్నేహితులు. అలా కుటుంబసభ్యులు స్నేహితులు కావడంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అలా ఇప్పుడు ఎట్టకేలకు వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. మౌనిక రెడ్డి తండ్రి భూమా నాగిరెడ్డి స్వర్గస్తులయ్యారు. దీంతో తన తండ్రిని మోహన్ బాబు లో చూసుకొని ఆమె కన్నీటి పర్యంతమైనట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరికీ కూడా ఇది రెండవ వివాహం కావడం గమనార్హం.
Congratulations #ManchuManoj and #BhumaMounikaReddy 🎉 pic.twitter.com/sKEwiKTK2y
— SRK (@iamsrk17_) March 3, 2023
Pictures loaded with Full of Love & Only LOVE ❤️
Congratulations to the lovely couple, Rocking Star #ManchuManoj & #BhumaMounika on their new journey 💖 pic.twitter.com/4afTtmaEAS
— Siddhu Tweets (@ProSiddhu_) March 3, 2023
READ ALSO : IND VS AUS : ఓటమి ముంగిట ఇండియా.. రోహిత్ చేసిన ఈ 3 తప్పిదాలు ఇవే