టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇండస్ట్రీలో కొన్ని కుటుంబాలు మాత్రమే బాగా పాపులర్ అయ్యాయి. అందులో మంచు వారి కుటుంబం ఒకటి. అక్కినేని, మెగాస్టార్ మరియు నందమూరి కుటుంబం తరహాలోనే మంచు మోహన్ బాబు కుటుంబం కూడా బాగా పాపులర్ అయింది.
ఇప్పటికే మోహన్ బాబు కుటుంబం నుంచి ముగ్గురు హీరోలు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. మోహన్ బాబు తో పాటు ఆయన ఇద్దరు కొడుకులు విష్ణు మరియు మనోజ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇలాంటి తరుణంలో… మంచు అభిమానులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు విష్ణు. మంచు కుటుంబం నుంచి మూడవ తరం వారసుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. విష్ణు వారసుడు, మోహన్ బాబు మనవడు అవరాం ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
Advertisement
మంచు విష్ణు నటించబోయే కన్నప్ప పాన్ ఇండియన్ సినిమాతో తన కుమారుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అనౌన్స్ చేశారు. అంతేకాకుండా తండ్రీ, కొడుకులు సేమ్ అవుట్ ఫిట్ తో ఫోటోలు దిగి వాటిని అభిమానులతో పంచుకున్నారు. ఇక మోహన్ బాబు లెగసి సినిమాల్లో కొనసాగుతోందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మోహన్ బాబుకి తన మనవడు అంటే అపారమైన ప్రేమ. ఇక తన మనవడు సినిమాల్లో నటిస్తున్నాడని తెలిసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటున్నాడు.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి