Home » కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తో మంచు విష్ణు భేటీ….అందుకోసమేనా…!

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తో మంచు విష్ణు భేటీ….అందుకోసమేనా…!

by AJAY
Ad

టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు నేడు హైదరాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. మా అధ్యక్షుడు మంచు విష్ణు తనను కలిశారని కిషన్ రెడ్డి తన ట్విటర్లో పేర్కొన్నారు. అయితే వీరిద్దరూ ఎందుకు సమావేశం అయ్యారు అనేది మాత్రం వెల్లడించలేదు.

Advertisement

Advertisement

ఇదిలా ఉండగా గత కొంత కాలంగా మోహన్ బాబు బిజెపిలో చేరుతారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు కిషన్ రెడ్డి గారిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మోహన్ బాబు తో పాటూ మంచు విష్ణు కూడా బిజెపిలో చేరే అవకాశం ఉందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.

 

మరోవైపు సినిమా రంగం అభివృద్ధి కోసం మా అధ్యక్షుడు విష్ణు కిషన్ రెడ్డిని కలిసి ఉంటారని కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఈ విషయం పై క్లారిటీ రావాలంటే మంచు విష్ణు స్పందించాల్సిందే. మరోవైపు ఏ విషయాన్ని అయినా సోషల్ మీడియా ద్వారా వెల్లడించే మంచు విష్ణు కిషన్ రెడ్డితో భేటీ అయిన విషయాన్ని మాత్రం తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు.

Visitors Are Also Reading