ఎంత ధనవంతులైన అన్ని రకాలు ఉన్నా మనం అనుకున్నట్టు జీవితం అనేది సాగిపోదు. మనం అనుకున్న దానికి భిన్నంగా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి.. అలా జరగడం కూడా అప్పుడప్పుడు మన మంచికే అనుకోవాలి.. అయితే అలాంటి సంఘటనే టాలీవుడ్ స్టార్ హీరో మోహన్‌బాబు ముద్దుల కుమార్తె మంచు లక్ష్మీ విషయంలో జరిగిందనీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. అదేంటంటే మంచు లక్ష్మికి ఆ స్టార్ హీరోతో పెళ్లి అవ్వాల్సిందట.. కానీ ఆమె పై చదువుల పై ఇంట్రెస్ట్ తో ఆ హీరోతో పెళ్లికి నో చెప్పి ఆ తర్వాత కొంత కాలానికి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని ఇండస్ట్రీ వర్గాల్లో న్యూస్ వైరల్ అవుతోంది.. మరి ఆయనెవరు అనేది పూర్తి వివరాలు చూద్దాం..
Advertisement
also read:హీరో బాలయ్య భయపడేది ఆవిడకు మాత్రమే..ఆమె శాసించిందంటే చేయాల్సిందే మరీ..!!
Advertisement
తెలుగు ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. ఆయనకు ముగ్గురు సంతానం.. కూతురు మంచు లక్ష్మి, కుమారులు మంచు మనోజ్,మంచు విష్ణు… ఈ ముగ్గురు ఇండస్ట్రీలో వారి టాలెంట్ ను నిరూపించుకోవాను కుంటున్నారు కానీ అంతగా బయటకు రావడం లేదు.. ఇందులో కూతురు మంచు లక్ష్మి తనదైన స్టైల్ లో సినిమాలు ఇతర క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అభిమానులు మెప్పిస్తోంది, కానీ స్టార్ నటిగా మాత్రం ఎదగలేక పోతుంది. అప్పట్లో మంచు లక్ష్మికి మోహన్ బాబు టాలీవుడ్ టాప్ స్టార్ హీరోతో పెళ్లి చేయాలని సంబంధం ఫిక్స్ చేశారట..
వారు మంచు ఫ్యామిలీకి చాలా దగ్గరి బంధువు అని కూడా తెలుస్తోంది. కానీ మంచు లక్ష్మి ఆ సమయంలో నాకు ఇప్పుడే పెళ్లి వద్దు విదేశాలకు వెళ్లి చదువుకుంటానని చెప్పిందట. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళని పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఆమె ముఖం మీదనే చెప్పేసిందట. ఈ విధంగా ఆ బడా ఫ్యామిలీకి కోడలు అయ్యే ఛాన్స్ ను మంచు లక్ష్మి కోల్పోయిందని న్యూస్ సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. మరి ఇందులో ఎంత వరకు నిజమో,అబద్దమో ఉందో తెలియదు కాని ఈ వార్త మాత్రం నెట్ లో హల్ చల్ చేస్తోంది.
also read:పాపం ప్రభాస్ దానినుండి ఎప్పుడు కోలుకుంటారో.. ఏమో..?