మెగాఫ్యామిలీ మరియు మంచు ఫ్యామిలీ మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి గతంలో కూడా మోహన్ బాబు చిరంజీవి మధ్య మాటలు లేవని వార్తలు వినిపించాయి. కానీ ఆ తరవాత ఇద్దరూ ఓకే స్టేజిపై కనిపించి అలాంటివేమీ లేవన్నట్టు కవర్ చేశారు. ఇక ఇటీవల వచ్చిన మా ఎన్నికల నేపథ్యంలో మంచు ఫ్యామిలీ మరియు మెగాఫ్యామిలీ మధ్య చిచ్చు మరోసారి బగ్గుమంది. చిరంజీవి తనను డ్రాప్ అవ్వమన్నారని మంచు విష్ణు బహిరంగంగా చెప్పుకొచ్చారు.
Advertisement
అంతే కాకుండా మెగాఫ్యామిలీ నుండి నాగబాబు ప్రకాష్ రాజ్ కు తన మద్దతును ప్రకటించారు. పవన్ కల్యాణ్ నాగబాబు తటస్థంగా ఉన్నట్టు కనిపించారు. కానీ చిరు కూడా ప్రకాష్ రాజ్ కు తన మద్దతు ప్రకటించారని నాగబాబు చెప్పారు. ఇక ఎన్నికలను మంచు ఫ్యామిలీ చాలా ప్రెస్టేజ్ గా తీసుకుంది. అంతే కాకుండా ఎన్నికలలో విజయం కూడా సాధించింది. అయితే ఎన్నికల తరావాత కూడా మంచు ఫ్యామిలీ పై ట్రోల్స్ తగ్గలేదు.
దాంతో కొంతమంది తమపై పగతోనే ట్రోల్స్ చేస్తున్నారంటూ ఆరోపించారు కూడా. ముఖ్యంగా నాగబాబు పైనే అనుమానం వ్యక్తం చేశారు. సన్ ఆఫ్ ఇండియాపై దారుణమైన ట్రోల్స్ రావడంతో మోహన్ బాబు లీగల్ గా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.ఇదిలా ఉంటే ఇప్పుడు మెగాస్టార్ ఆచార్య సినిమాకు కూడా నెగిటివ్ టాక్ వస్తుంది. సినిమాపై ట్రోల్స్ కూడా ఎక్కువగానే వస్తున్నాయి.
ఇలాంటి సమయంలో మంచు లక్ష్మి తన కూతురు తో కలిసి బుల్లెట్ బండి పాటకు స్టెప్పులు వేసింది. దాంతో కొంతమంది నెటిజన్లు ఆచార్య దొబ్బినందుకే డ్యాన్స్ చేశారా అంటూ కామెంట్ లు పెడుతున్నారు. మంచు లక్ష్మి సరదాగా చేసినట్టు ఉంది కానీ నెటిజన్లు మాత్రం ఆచార్య కు నెగిటివ్ టాక్ రావడం వల్లే అంటూ కామెంట్స్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.