మంచు మోహన్ బాబు కూతురు మంచి లక్ష్మీ టాలీవుడ్ ప్రేక్షకులకు ఈమె గురించి తెలిసిన విషయమే. ఇక మంచు లక్ష్మీకి సోషల్ మీడియా ఫ్యాన్స్, ఫాలోవర్స్ బాగానే ఉన్నారనే చెప్పాలి. ఈమె పెట్టే పలు పోస్టులకు ప్రశంసలు కురిపించిన వారితో పాటు విమర్శలు చేసే వారు కూడా ఎక్కువనే. తాజాగా మంచులక్ష్మీ గొప్ప నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంది. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 50 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది.
ప్రయివేటు పాఠశాలలను మైమరిపించేవిదంగా స్మార్ట్ క్లాసెస్ ప్రారంభిచనున్నట్టు మంచి లక్ష్మీ మీడియాకు వెల్లడించింది. 1 నుంచి 5 తరగతుల వరకు 3 సంవత్సరాల పాటు స్మార్ట్ క్లాసెస్ నిర్వహిస్తూనే పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయనున్నట్టు పేర్కొంది. పిల్లలకు మెరుగైన విద్య అందాలి. చాలా మంది మధ్యలోనే డ్రాప్ అవుతున్నారు. అలా కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందాలనే ఉద్దేశంతో దత్తత తీసుకునే ప్రోగ్రామ్ ప్రారంభించాం అని తెలిపారు.
Advertisement
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు- మనబడి కార్యక్రమం అద్భుతం అని కొనియాడారు. ఒక మూడు సంవత్సరాల్లో మేము చేసే అభివృద్ది కనిపిస్తుందని వెల్లడించారు మంచు లక్ష్మీ. పాఠశాలలు బాగుంటే చదువు మానేయాలనే ఆలోచన కూడా విద్యార్థులకు రాదని ఆమె అభిప్రాయ పడ్డారు. మంచు లక్ష్మీ చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమాన్ని అభిమానులు ప్రసంసించారు. పిల్లల చదువుకు పెద్దపీట వేసే ముందడుగు తప్పకుండా విజయవంతమవుతుందని సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read :
విజయ్ దేవరకొండ లైగర్ ట్రైలర్ లో ఈ 5 మైనస్ పాయింట్స్ మీరు గమనించారా..?
పిల్లలు బరువు పెరిగేందుకు ఈ ఆహారం తప్పకుండా ఇవ్వండి..!