Home » విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ ట్రైల‌ర్ లో ఈ 5 మైన‌స్ పాయింట్స్ మీరు గ‌మ‌నించారా..?

విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ ట్రైల‌ర్ లో ఈ 5 మైన‌స్ పాయింట్స్ మీరు గ‌మ‌నించారా..?

by Anji
Ad

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన చిత్రం లైగర్. టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుల్లో ఒరైన పూరి జగన్నాథ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం అంద‌రికీ తెలిసిందే. ఈ త‌రుణంలో అటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు పెరిగిపోయాయి. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సిక్స్ ఫ్యాక్ చేయడం ఇందులో బాక్సర్ మైక్ టైసన్ అనిపించడంతో ఇంకా అంచనాలు పెంచుతోంది.ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క ట్రైలర్ అద్భుతంగా ఉంద‌నే చెప్పాలి. కానీ ఈ ట్రైలర్ లో కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1. సాధారణంగా తెలుగు సినిమా ట్రైలర్ అంటే దాదాపు డైలాగ్స్ ఆశిస్తుంటారు అభిమానులు. పూరి సినిమా అంటే డైలాగ్స్ కోసం ఎదురుచూపులు తప్పకుండా ఉంటాయి. కానీ ఇటీవల విడుదలైన ట్రైలర్ లో డైలాగ్స్ కంటే ఎక్కువ పాటనే వినిపించడం విశేషం. ఇదొకటి ప్రేక్షకులను నిరాశపరిచింది.

2. ఇక ఈ రౌడీ హీరో కి జంట‌గా బాలీవుడ్ బ్యూటీ అనన్య నటించిన ట్రైలర్ లో కాస్త అందంగా కనిపించింది. ఎందుకో వీరిద్దరి సీన్లు అనవసరంగా అతికించినట్లుగా కనిపించాయి. మరి పూర్తి సినిమాలో అయినా వీరి కాంబినేషన్ ఎలా ఉంటాయో చూడాలి.

Advertisement

3. ఈ సినిమాకు సంబంధించి ఇదివ‌ర‌కు విడుదలైన ఒక టీజర్ ఒక్కసారిగా అంచనాలను పెంచింది. ట్రైలర్ కోసం అప్పటి నుంచి ఎదురుచూపులు ప్రారంభమయ్యాయి. ఇక ఇన్ని రోజులు నిరీక్షణకు ట్రైలర్ సంతృప్తి పరచలేదు అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ట్రైలర్ కాస్త కన్ఫ్యూషన్ గానే ఉంది అని అంటున్నారు కొంతమంది.

4. మామూలుగా ఈ ట్రైలర్ లో హైప్ ఇచ్చే సీన్స్ చాలానే ఉంటాయి. కానీ లైగ‌ర్ ట్రైలర్ లో మాత్రం అలాంటివి చాలా తక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది. ఇక చివర‌కు మైక్ టైసన్ కనిపించేది కూడా బ్రూస్లీ సినిమాలో చిరంజీవి ఎంట్రీ గుర్తొచ్చే విదంగా ఉంది అని కొంతమంది త‌మ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

5. ఇక లైగ‌ర్ ట్రైలర్ చూస్తే అప్పుడెప్పుడో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కించిన అమ్మ‌నాన్న ఓ త‌మిళ అమ్మాయి సినిమా షేడ్స్ ఎక్కువ‌గా కనిపిస్తున్నాయి అనే టాక్ వినిపిస్తోంది. ఈ ట్రైలర్ లో కథ కొత్తగా కనిపించకపోవడంతో ట్రైలర్ పై నెగిటివ్ కామెంట్స్ చాలానే వినిపిస్తున్నాయి. ఇక సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం ఆగ‌స్టు 22 వ‌ర‌కు ఎదురు చూడాల్సిందే.

Also Read : 

హీరోయిన్ స‌మంత‌కు అరుదైన గౌర‌వం.. ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసిన సామ్‌..!

“గంగోత్రి” సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..? ఏం చేస్తుందంటే..!

 

Visitors Are Also Reading