మంచు మోహన్ బాబు తనయుడు హీరో మంచు మనోజ్ తన భార్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ లైఫ్ లో వచ్చిన ఇబ్బందుల వల్లనే మనోజ్ గత కొంతకాలంగా సినిమాలకు కూడా దూరంగా ఉంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇటీవల వినాయకచవితి నవరాత్రుల సమయంలో మంచు మనోజ్ భూమా మౌనికారెడ్డి తో కలిసి హైదరాబాద్ లోని ఓ వినాయక మండపం వద్ద దర్శనం ఇచ్చాడు.
Advertisement
గతంలోనే వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక మనోజ్ మౌనికా రెడ్డితో వినాయకమండపం వద్ద కనిపించడంతో ఆ వార్తలకు బలం చేకూరింది. వీరిద్దరూ గత కొంతకాలంగా చెన్నై లో ఒకే ఇంట్లో ఉన్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ…
Advertisement
పెళ్లి గురించి త్వరలోనే మీడియా ముందు మాట్లాడతానని అన్నారు. సినిమాలు మరియు పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా మాట్లాడతానని చెప్పారు. ఇక త్వరలోనే మౌనికారెడ్డి మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా మొదటి సారి మంచు ఫ్యామిలీ నుండి మనోజ్ రెండో పెళ్లి పై ఒకరు స్పందించారు. ఆ స్పందించింది కూడా మరెవరో కాదు మనోజ్ సోదరి మంచు లక్ష్మి.
తాజాగా ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్ చేశారు. మనోజ్ పెళ్లి చేసుకుంటే నేనేం అంటానండి బాబు ఎవడి దూల వాడిది. ఎవరి బ్రతుకు వాళ్లని బ్రతకనివ్వండి. హానెస్ట్ లవ్ ను నేను బ్లెస్ చేస్తా…లైఫ్ లో రెండు ఎమోషన్స్ లవ్…భయం..జీవితాన్ని లవ్ తో లీడ్ చేస్తున్నామా లేదంటే భయంతో లీడ్ చేస్తున్నామా అనేది తెలుసుకోవాలి. నేను లవ్ తో నా జీవితాన్ని లీడ్ చేస్తున్నా అంటూ మంచు లక్ష్మీ కామెంట్స్ చేశారు.