తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంకా అంటూ ఆడి పాడిన చిన్నారి మీకు గుర్తుందా..! మనసంతా నువ్వే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఈమె పేరు సుహాని కలిత. బాలనటిగానే కాకుండా హీరోయిన్గా కూడా మెప్పించింది సుహాని. తాజాగా ఈమె పెళ్లి పీటలెక్కింది. సంగీత కారుడు, మోటివేషనల్ స్పీకర్ విభర్ హసీజాతో ఏడడుగులు నడిచింది. సుహాని కలిత ఇన్‌స్టాగ్రామ్‌లో హల్దీ వేడుకల నుంచి వివాహం, రిసెప్షన్ వరకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Advertisement
బాల రామాయణం సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయింది సుహాని. వెంకటేష్ నటించిన ప్రేమంటే ఇదేరా, గణేష్, చిత్రాలతో పాటు ఉదయ్‌కిరణ్ హీరోగా నటించిన మనసంతా నువ్వే, తరుణ్ హీరోగా నటించిన ఎలా చెప్పను వంటి పలు చిత్రాల్లో ఈమె బాలనటిగా అలరించింది. తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో కూడా వరుసగా అవకాశాలు అక్కడ కూడా సినిమాలు చేసింది.
Advertisement
ఇది కూడా చదవండి : చిరంజీవి ఇంద్ర స్టోరీని తొలుత ఆ దర్శకుడు రిజెక్ట్ చేశాడనే విషయం మీకు తెలుసా..?
పలు కంపెనీల వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. 2008 సవాల్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది సుహాని. కథానాయికగా ఆమెకు పెద్ద గుర్తింపు రాలేదు. చివరిగా ఆమె తెలుగులో 2010లో స్నేహగీతం సినిమాలో కనిపించింది. ఇక ఆ తరువాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన సుహాని ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి : NTR కూతురు పురందేశ్వరి సినిమాలో నటించిన విషయం మీకు తెలుసా..?