Maname Review: మనమే సినిమాకు టిజి విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచిభొట్ల నిర్మాతలుగా వ్యవహరించారు.
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. సంగీతాన్ని హేశం అబ్దుల్ వహాబ్ అందించారు. శర్వానంద్, కృతి శెట్టి, విక్రమ్ ఆదిత్య తదితరులు ఈ సినిమాలో నటించారు. విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇక ఈ సినిమా కథ రివ్యూ రేటింగ్ చూద్దాం.
సినిమా: మనమే
దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య
నిర్మాత: టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల
నటీ నటులు: శర్వానంద్, కృతి శెట్టి, విక్రమ్ ఆదిత్య తదితరులు
సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
Advertisement
కథ మరియు వివరణ:
ఈ కథ లో హీరో మరియు హీరోయిన్ పెళ్లి చేసుకుని లండన్ లో సెటిల్ అవుతారు, వాళ్ల పిల్లాడి వల్ల వారి జీవితాలు తలకిందులౌతాయి. వీరు ఇద్దరి వ్యక్తిత్వాలు చాలా వేరు అయితే హీరో ఎప్పుడూ బిజీగా ఉంటూ బాబుతో ఎక్కువ సమయం కేటాయించడు దానివల్ల ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి, అయితే హీరోయిన్ కృతి శెట్టి చాలాసార్లు హీరో తో గొడవపడుతూ కనిపిస్తుంది. అయితే ఆ పిల్లాడి గురించి హీరోయిన్ ఎందుకు అంత కేర్ తీసుకుంటుంది, ఎలా సమస్యలను తగ్గిస్తుంది వంటి విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా ఈ సినిమాను చూడండి.
Also read:
Advertisement
ఈ మూవీ ని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కొంచెం కొత్తగా ప్రయత్నం చేసారు. కథ కొత్తగా ఉంటుందనే ఉద్దేశ్యంతో కథ రాసినా రెగ్యులర్గానే వుంది. ఫస్ట్ మొదటి పది నిమిషాలు బానే వుంది. కానీ ఆ తర్వాత నుంచి ప్రేక్షకుడిని బాధ కలిగించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా సింపుల్ గా వుంది. హై ఎమోషన్, ఎలివేషన్ ఏం లేవు. నెక్స్ట్ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకు రావాలనుకున్న కానీ పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. సెకండాఫ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే బెటర్. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ కూడా ఏమి ఇంపాక్ట్ చూపలేదు. బిట్ సాంగ్స్, ఫుల్ సాంగ్స్ అన్ని 15 సాంగ్స్ ఉండడం మూవీకి పెద్ద మైనస్.
Also read:
ప్లస్ పాయింట్స్:
హీరో పర్ఫామెన్స్
సెకండాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్లు:
స్క్రీన్ ప్లే
మ్యూజిక్
రేటింగ్: 2.25/5
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!