Telugu News » ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ వాడిన బైక్ కోసం ఎంత ఖ‌ర్చు చేసారో తెలుసా..?

ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ వాడిన బైక్ కోసం ఎంత ఖ‌ర్చు చేసారో తెలుసా..?

by Bunty

తెలుగు సినిమా సత్తాను ‘బాహుబలి’ సినిమాతో ఎల్లలు దాటించాడు ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి.. మళ్ళీ ఇప్పుడు అదే రేంజ్‌లో RRR రూపొందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ (‘రౌద్రం, రణం, రుధిరం) ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మొదటిసారి కలిసి నటిస్తున్నారు.

Ads

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ త‌రువాత ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాపై దేశ‌వ్యాప్తంగా భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమా వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న‌ థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఇక ఇటీవ‌ల విడుద‌లైన‌ ట్రైలర్ అభిమానుల అంచెనాలను ట్రిపుల్ చేసింది.

అయితే, సినిమా విషయంలో ఎక్కడ కూడా రాజీపడలేదని దర్శకుడు రాజమౌళి తెలిపారు. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ వాడిన బైక్ అందరినీ ఆకర్షించింది. దీంతో నెట్టింట ఈ బైక్ గురించి చాలా రీసెర్చ్ చేశారట.. ఈ బైక్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బైక్ పేరు వెలోసెట్ రెట్రో బైక్.. ఆ బైక్‌ 1934 కు చెందిన ఎమ్‌ సిరీస్ బైక్‌లా కనిపిస్తోంది. సినిమా కోసం బైక్‌లో కొన్ని మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది.

ఇది బ్రిటన్‌‌‌‌కి చెందింది. వెలోసెట్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. వెలోసెట్‌ ఎమ్‌ సిరీస్‌ బైక్‌ ధర ప్రస్తుతం సుమారు రూ.9 లక్షలుగా ఉంది. అది కూడా వేలం వెబ్‌సైట్‌లోనే కనిపిస్తుంది. ఈ కంపెనీ హెడ్ ఆఫీస్ బర్మింగ్‌హామ్‌లో ఉంది. 1920 నుంచి 1950 వరకు.. వెలోసెట్‌ అంతర్జాతీయ మోటార్ రేసింగ్‌ విభాగంలో ప్రధాన పోటీదారుగా నిలిచింది. శక్తివంతమైన 350 సిసి, 500 సిసి బైక్‌లను  ఈ వెలోసెట్ త‌యారు చేసింది  .


You may also like