శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను అద్భుత విజయం సాధించి టీమిండియా జోరు మీద ఉంది. బ్యాట్‌తో, బంతితో అదరగొట్టిన రోహిత్ సేన.. జూన్, జులైలో తన తరువాత మ్యాచ్‌లో ఆడనున్నది. ఆలోపు ఆటగాళ్లు అంరూ వేసవిలో అభిమానులకు పసందైన వినోదం అందించేందుకు ఐపీఎల్ 15వ సీజన్ ఆడనున్నారు. అయితే ఈసారి సీజన్ నిబంధనల్లో పలు కీలక మార్పులు చోటు చేసుకునే అవకశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చింది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఇవ్వనుందని చెప్పారు.
Advertisement
ఏదైనా జట్టు మ్యాచ్‌కు ముందు కరోనా బారినపడితే.. ఆరోజు మ్యాచ్‌లో దిగేందుకు 11 మంది సరైన ఆటగాళ్లు లేకపోతే ఏమి చేయాలనే దానిపైనే కచ్చితమైన ప్రణాళిక రూపొందించారు. ఇదివరకు అలాంటి పరిస్థితుల్లో ఆరోజు జరగాల్సిన మ్యాచ్‌ను రీ షెడ్యూల్ చేసేవారు. ఇప్పుడు కూడా అలా రీ షెడ్యూల్ చేసేందుకు చూస్తారు. ఒకవేళ అది కూడా సాధ్యం కానీ పరిస్థితుల్లో ఆ విషయాన్ని ఐపీఎల్ టెక్నికల్ టీమ్ దృష్టికి తీసుకెళ్తారు. వాళ్లు తీసుకునే నిర్ణయం అంతిమం.
Advertisement
- రెండవ మార్పు.. ప్రతి ఇన్నింగ్స్‌లో ఒక్కో జట్టుకు రెండు రివ్యూలు కోరే అవకాశం. అంతకు ముందు ప్రతి ఇన్నింగ్స్‌లో ఒక్కో జట్టుకు ఒక్కో సమీక్ష కోరే వెసులుబాటు మాత్రమే ఉండేది. దానిని ఇప్పుడు రెండుకు పెంచారు. దీంతో ఒక్కో జట్టు ఒక్కో ఇన్నింగ్స్‌లో రెండేసి రివ్యూలు ఉపయోగించుకోవచ్చు.
- మరొక వైపు ఇటీవల మెరిల్ బోర్న్ క్రికెట్ క్లబ్ తీసుకొచ్చిన కొత్త నిబంధన ఎవరైనా బ్యాట్స్‌మెన్ క్యాచ్ ఔట్ అయిన సందర్భంలో క్రీజులోకి వచ్చే ఆటగాడే స్ట్రైక్లింగ్ చేయాలనే కొత్త నిర్ణయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. దానిని ఈ సీజన్‌లోనే అమలు చేయాలనుకుంటున్నారు.
- ఇక ప్లే ఆఫ్స్ లేదా ఫైనల్ లాంటి కీలక మ్యాచ్‌లో ఏదైనా ఫలితం తేలకుండా టైగా మారితే.. నిర్ణీత సమయంలో సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. అది కూడా కుదరని పక్షంలో లీగ్ స్టేజ్‌లో పాయింట్ల పట్టికలో మెరుగుగా ఉన్న జట్టునే విజేతగా ప్రకటిస్తారని అధికారి చెప్పారు.
Also Read : IPL 2022 : అసిస్టెంట్ కోచ్‌గా షేన్ వాట్సన్.. ఏ జట్టుకో తెలుసా..?