Telugu News » Blog » IPL 2022 : అసిస్టెంట్ కోచ్‌గా షేన్ వాట్స‌న్‌.. ఏ జ‌ట్టుకో తెలుసా..?

IPL 2022 : అసిస్టెంట్ కోచ్‌గా షేన్ వాట్స‌న్‌.. ఏ జ‌ట్టుకో తెలుసా..?

by Anji
Ads

ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండ‌ర్ షేన్ వాట్స‌న్‌ను సహాయ‌క కోచ్‌గా నియమిస్తున్న‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించిన‌ది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఈ మేర‌కు ఐపీఎల్ లెజెండ్, టీ-20 అత్యుత్త‌మ ఆల్‌రౌండర్ కు స్వాగ‌తమంటూ ట్వీట్ చేసింది. ప్ర‌స్తుతం ఢిల్లీ జ‌ట్టుకు ఆస్ట్రేలియా దిగ్గ‌జ ఆట‌గాడు రిక్కీ పాంటింగ్ ప్ర‌ధాన కోచ్‌గా ఉన్నాడు. ప్ర‌వీణ్ ఆమ్రే, అగార్క‌ర్ స‌హాయ కోచ్‌లుగా జేమ్స్ హోప్స్ బౌలింగ్ కోచ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌న నియామ‌కం ప‌ట్ల వాట్స‌న్ హ‌ర్షం వ్య‌క్తం చేశాడు.

Ads

ప్ర‌పంచంలోనే ఉత్త‌మ టీ-20 టోర్న‌మెంట్ ఐపీఎల్‌ అని, ముఖ్యంగా ఐపీఎల్ ఆట‌గాడిగా నాకు అద్భుత‌మైన జ్ఞాప‌కాలున్నాయ‌ని.. 2008 తొలి ఐపీఎల్ గెలిచిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టులో సభ్యుడిగా షేన్ వార్న్ నాయ‌క‌త్వంలో ఆడాను అని గుర్తు చేశారు. ఆ త‌రువాత ఆర్‌సీబీ, చెన్నై జ‌ట్ల‌కు ఆడాను. రిక్కి పాంటింగ్ ఆధ్వ‌ర్యంలో ప‌ని చేసే అవ‌కాశం వ‌చ్చింది. అత‌ను అద్భుత‌మైన నాయ‌కుడు. ప్ర‌పంచంలోనే అత్య‌త్త‌మ కోచ్‌ల‌లో ఒక‌డు. అత‌డి సార‌థ్యంలో ప‌ని చేసేందుకు సంతోషిస్తున్నాను.

Ads

ఈ సీజ‌న్‌లో ఢిల్లీకి రిష‌భ్ పంత్ సార‌థ్యం వ‌హించ‌నున్నాడు. అత‌నిపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. జ‌ట్టులో డేవిడ్ వార్న‌ర్‌, పృథ్వీషా, రోవ్‌మ‌న్ పావెల్‌, మిషెల్ మార్ష్ వంటి హిట్ట‌ర్లున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో అక్ష‌ర్ ప‌టేల్, శార్దూల్ ఠాకూర్, అన్రిచ్ నోర్జ్ వంటి వారితో జ‌ట్టు ప‌టిష్టంగా క‌న‌బ‌డుతోంది.

Ad

Also Read :  RRR : జ‌క్క‌న్న భారీ ప్ర‌మోష‌న్స్ కు స్కెచ్‌.. ఇక ఫ్యాన్స్ కు పండ‌గే..!