సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో బ్లాక్ బాస్టర్ మూవీ గా నిలిచిన సినిమాల్లో ఒక్కడు మూవీ ఒకటి. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించగా… భూమికా చావ్లా ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ప్రకాష్ రాజ్ ఈ మూవీలో విలన్ పాత్రలో నటించగా… మణిశర్మ ఈ మూవీకి సంగీతం అందించాడు. మణిశర్మ అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో అత్యంత కీలకపాత్రను పోషించింది.
Advertisement
సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్మెస్ రాజు ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా 2003 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా మంచి అంచనాలు నడుమ విడుదల అయ్యి విడుదల అయిన మొదటి రోజు మొదటి షోకే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. ఆ రోజుల్లోనే 14 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా దాదాపు 30 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసి అప్పటివరకు మహేష్ కెరియర్ లో ఏ మూవీ కూడా కలెక్ట్ చేయని రేంజ్ లో కలక్షన్ వసూలు చేసి ఈ హీరోకు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో స్టేటస్ ను తీసుకువచ్చింది.
Advertisement
ఇంతటి గొప్ప విజయాన్ని సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమాకు మొదటగా ఒక్కడు అనే టైటిల్ ను కాకుండా మరో రెండు టైటిల్ లను మూవీ బృందం పరిశీలించిందట… దాదాపు ఆ టైటిల్ లలో ఏదో ఒక దానిని ఫిక్స్ చేద్దాం అనుకున్నారట కాకపోతే అనివార్య కారణాలవల్ల ఒక్కడు అనే టైటిల్ ను ఈ చిత్ర బృందం ఫిక్స్ చేయవలసి వచ్చిందట. ఈ మూవీ కథ అంతా భూమిక చుట్టూ తిరుగుతుంది. భూమిక ను సేవ్ చేయడానికి మహేష్ ఎల్లవేళలా తనకు రక్షకుడిగా ఉంటాడు.
దానితో అతడే ఆమె సైన్యం అనే టైటిల్ ను ఫిక్స్ చేద్దాం అని ఈ మూవీ మేకర్స్ అనుకున్నారట. కాకపోతే అప్పటికే ఈ టైటిల్ ఎవరో రిజిస్టర్ చేయించుకున్నారట. వారిని ఎంత బతిమిలాడినా కానీ వారు ఆ టైటిల్ ను ఇచ్చేందుకు ఒప్పుకోలేదట. ఆ తర్వాత ఈ మూవీ కబడ్డీ నేపథ్యంలో సాగుతూ ఉండడంతో ఈ మూవీకి కబడ్డీ అని టైటిల్ ను పెడదాం అనుకున్నారట. కాకపోతే ఈ టైటిల్ మాస్ జనాలకు ఎక్కదు అనే రీజన్ తో ఈ టైటిల్ ని కూడా పక్కన పెట్టారట. లాస్ట్ కు ఒక్కడు అనే టైటిల్ ను అనుకోగా … ఈ టైటిల్ పవర్ ఫుల్ గా ఉంది. అలాగే చాలా బాగుంది అనే రీసన్ తో మూవీ బృందం అంతా ఈ టైటిల్ ను ఓకే చేశారట.