దాదాపుగా చాలా వరకు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ వయసు ఉన్న హీరోల పక్కన తక్కువ వయసు ఉన్న హీరోయిన్లు నటిస్తూ ఉంటారు. అలాగే సీనియర్ హీరోలు కూడా చాలా తక్కువ వయసు ఉన్న హీరోయిన్లతో ఆడిపాడుతూ ఉంటారు. చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే హీరోలు తమ కంటే ఎక్కువ వయసు ఉన్న ముద్దుగుమ్మల పక్కన నటిస్తూ ఉంటారు.
Advertisement
అందులో భాగంగా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న మహేష్ బాబు… ఎన్టీఆర్ కూడా తమకంటే ఎక్కువ వయసు ఉన్న హీరోయిన్లతో ఆడి పాడిన సందర్భాలు ఉన్నాయి. ఆ సినిమాలు ఏవి… ఆ ముద్దుగుమ్మలు ఎవరు అనేది తెలుసుకుందాం.
Advertisement
చాలా సంవత్సరాల క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్… ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సింహాద్రి అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో భూమిక చావ్లా… అంకిత హీరోయిన్లుగా నటించారు. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ కంటే భూమిక వయసులో కాస్త పెద్దది. అలా తనకంటే ఎక్కువ వయసు ఉన్న హీరోయిన్ తో ఆడి పాడిన ఎన్టీఆర్ ఈ మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సాంబ మూవీ రూపొందింది.
టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు చాలా సంవత్సరాల క్రితం వంశీ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో నమ్రతా శిరోద్కర్ హీరోయిన్గా నటించింది. ఈమె మహేష్ కంటే వయసులో పెద్దది. ఈ సినిమా ద్వారా వీరిద్దరికి పరిచయం ఏర్పడి తర్వాత వీరు వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి దాంపత్య జీవితం చాలా ఆనందకరంగా సాగుతోంది.