లేడీ సూపర్ స్టార్ నయనతార గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు సోషల్ మీడియాలో ఆమెపై ఎన్నో వార్తలు వస్తున్నాయి. హీరో ధనుష్ గురించి సోషల్ మీడియా వేదికగా మూడు పేజీల లేఖను ఒకటి ఆమె విడుదల చేయడంతో నయనతార, ధనుష్ మధ్య వివాదం మొదలైంది. నెట్ ఫిక్స్ నయనతార డాక్యుమెంటరీని రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ లో నయనతార చిన్నప్పటి నుంచి జరిగిన విషయాల గురించి ప్రస్తావించారు. అలాగే పెళ్లి, పిల్లల గురించి కూడా ఇందులో ఉంది. ఈ క్రమంలో డాక్యుమెంటరీ కోసం నయనతార, ధనుష్ నిర్మించిన చిత్రం నుంచి మూడు సెకండ్ల ఫుటేజ్ తీసుకోవడం వలన ధనుష్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement
అంతే కాదు 10 కోట్ల రూపాయల లీగల్ నోటీసునని నయనతారకు పంపించారు. ఈ విషయంపై ఇద్దరి మధ్య వివాదం నెలకొంది ఈ డాక్యుమెంటరీ సోమవారం నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కాబోతోంది. ఈ డాక్యుమెంటరీ ద్వారా నయనతార, ధనుష్ వివాదం చెలరేగుతున్న సమయంలో మహేష్ బాబు ఒక పోస్ట్ పెట్టారు.
Also read:
డాక్యుమెంటరీ చూశానని ఈయన సోషల్ మీడియా వేదికగా పోస్టర్ ని షేర్ చేస్తూ లవ్ ఎమోజీస్ ని షేర్ చేశారు. ఈ పోస్ట్ కాస్త వైరల్ అవ్వడమే కాదు మహేష్ బాబుకి నయనతార డాక్యుమెంటరీ అంత బాగా నచ్చేసింద అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే మహేష్ బాబు రాజమౌళి సినిమా షూటింగ్ పనులతో బిజీ అవ్వనున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!