సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ హీరోగా గట్టిగానే సంపాదిస్తారన్న సంగతి తెలిసిందే. ఆయన అందం, నటనా ప్రతిభ ఆయనకు మరిన్ని అవకాశాలను తెచ్చి పెడుతూ ఉంటాయి. అలాగే.. ఆయనకు టాలీవుడ్ లో కోట్లలో అభిమానులు ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఇప్పుడు రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు. తాజాగా ఆయన హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన సినిమాలు అన్నీ హిట్ అవుతూనే ఉంటాయి.
Advertisement
రీసెంట్ మూవీ గుంటూరు కారం కూడా హిట్ అవుతుందనే టాక్ కూడా వచ్చేసింది. సినిమా రంగంలో గట్టిగానే సంపాదిస్తూ టాప్ హీరోగా ఉన్న మహేష్ బాబు.. చాలా కాలం క్రితమే వ్యాపార రంగంలో కూడా అడుగు పెట్టారు. బిసినెస్ రంగంలో కూడా ఈయన బాగానే సంపాదిస్తున్నారని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో ఫేమస్ ఏఎంబీ సినిమాస్ మహేష్ బాబుదే అన్న సంగతి చాలా మందికి తెలిసినదే. దీనితో గట్టిగానే లాభాలు సంపాదిస్తున్నారు.
Advertisement
ఈ క్రమంలోనే ఏషియన్ వారితో కలిసి ఓ రెస్టారెంట్ ని కూడా ప్రారంభించారు. ఏఎన్ ప్యాలెస్ హైట్స్ అనే పేరుతొ బంజారాహిల్స్ లో ఉంది ఈ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ లో ఒక్కసారి టిఫిన్ చెయ్యాలి అంటే ఐదొందలు సమర్పించుకోవాలి. ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ దోస తినాలన్న కనీసం ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు ఉంటుంది. అయితే.. ఇక్కడ ఫుడ్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకరోజుకు కనీసం రూ. 8 నుంచి రూ. 10 లక్షల వరకు బిజినెస్ జరుగుతుందట. ఒక సామాన్యుడికి ఒక్క రోజులో ఇంత సంపాదన అనేది కలలో మాటే.