Home » కూల్ డ్రింక్ యాడ్ కోసం మ‌హేశ్ ఎన్నికోట్లు పుచ్చుకున్నారో తెలుసా..?

కూల్ డ్రింక్ యాడ్ కోసం మ‌హేశ్ ఎన్నికోట్లు పుచ్చుకున్నారో తెలుసా..?

by AJAY
Ad

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు వ‌రుస సినిమాలు చేస్తూ ఎప్పుడూ బిజీగా ఉంటారు. టాలీవుడ్ స్టార్ హీరోల‌లో ఒక‌రిగా ఉన్న మ‌హేశ్ బాబుకు ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ విష‌యానికి వ‌స్తే మ‌హేశ్ బాబు త‌ర‌వాతే ఎవ‌రైనా అని చెప్ప‌డానికి ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదు. ఆ పేరులోనే వైబ్రేష‌న్స్ ఉన్నాయంటూ మ‌హేశ్ బాబు ఫ్యాన్స్ ముర‌సిపోతుంటారు. ఇక హీరోలు ఏం చేస్తే అభిమానులు కూడా అది ఫాలో అవుతూ ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే.

mahesh babu mountain dwe

mahesh babu mountain dwe

అందువ‌ల్లే హీరోల‌ను ఎక్కువ‌గా ప‌లు కంపెనీలు బ్రాండ్ అంబాసిడ‌ర్లు గా నియ‌మించుకుంటాయి. ఇక టాలీవుడ్ లో ఎక్కువ క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ లో న‌టించేవారిలో మ‌హేశ్ బాబు కూడా ఒక‌రు. మ‌హేశ్ బాబు సంతూర్, థ‌మ్సప్ తో పాటూ ప‌లు బ్రాండ్ ల‌కు గ‌తంలో బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రించేవారు. అయితే తాజాగా మ‌హేశ్ బాబు చేతికి మ‌రో బ్రాండ్ వ‌చ్చింది.

Advertisement

Advertisement

కూల్ డ్రింక్ మౌంటెయిన్ డ్యూ కు మ‌హేశ్ ప్ర‌స్తుతం బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. ఈ బ్రాండ్ కు హిందీలో షారుక్ ఖాన్ అంబాసిండ‌ర్ గా చేశారు. అయితే షారుఖ్ ఖాన్ ఈ యాడ్ కోసం రూ,10 కోట్లు పుచ్చుకున్నార‌ట‌. ఇక మ‌హేశ్ బాబు బాలీవుడ్ హీరో కంటే ఎక్కువే పుచ్చుకున్నట్టు తెలుస్తోంది.

మ‌హేశ్ ఈ యాడ్ కోసం ఏకంగా రూ.12 కోట్లు పుచ్చుకుంటున్నట్టు టాక్. ఇదిలా ఉండ‌గా గ‌తంలో మౌంటెయిన్ డ్యూ కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా అఖిల్ వ్యవ‌హ‌రించారు. కానీ ఈ బ్రాండ్ కు పెద్ద‌గా గుర్తింపు రాలేదు. మ‌రి మ‌హేశ్ వ‌ల్లైనా ఈ కూల్ డ్రింక్ సేల్స్ పెరుగుతాయో లేదో చూడాలి.

Visitors Are Also Reading