Home » Mahesh Babu: మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?

Mahesh Babu: మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?

by Srilakshmi Bharathi
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. తండ్రి సపోర్ట్ తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. తన సొంత టాలెంట్ తో ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నారు. ఎన్నో కొత్త కాన్సెప్ట్స్ తో సినిమాలు తీసి అన్ని వర్గాల ప్రేక్షకులలోను అభిమానులను సంపాదించుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఆయన వర్క్ చేసిన సంవత్సరాలు పెరిగే కొద్దీ ఆయన వయసు తగ్గుతూ వస్తోంది. అంతగా.. ఆయన తన శరీరం, ఆరోగ్యం పట్ల కేరింగ్ తీసుకుంటూ ఉన్నారు.

Advertisement

ఇది ఇలా ఉంటె.. ఇప్పటి వరకు స్టార్ హీరోలు అందరు డ్యూయల్ రోల్స్ చేస్తూనే ఉన్నారు. డ్యూయల్ రోల్స్ తో కూడా ప్రేక్షకులని మెప్పించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే..టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న మహేష్ బాబుకు మాత్రం చెప్పుకోదగ్గ డ్యూయల్ రోల్స్ సినిమాలు పెద్దగా లేవు. అయితే.. సూపర్ స్టార్ మహేష్ బాబు అసలు డ్యూయల్ రోల్ లో నటించారా? అని డౌట్ వస్తోందా. ఒకే ఒక్క సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో నటించారు. ఆ సినిమా ఏదో ఇప్పుడు చూద్దాం.

Advertisement

ఆ సినిమా మరి ఏదో కాదు నాని సినిమా. ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అమీషా పటేల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. మహేష్ సోదరి మంజులా ఘట్టమనేని ఈ సినిమాను నిర్మించారు. 2004లో విడుదలైన ఈ సినిమా ఎబోవ్ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా లో మహేష్ సింగిల్ రోల్ లోనే ఉంటారు. కానీ, చివరకు వచ్చేసిన కొద్దీ సేపు మాత్రం తండ్రి కొడుకులుగా కనిపిస్తారు. అయితే.. ఈ సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉండడం, మహేష్ బాబు తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ లో ఉండడంతో ఈ సినిమా ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదనే చెప్పొచ్చు. అందుకే ఈ సినిమా హిట్ అవలేదు అన్న టాక్ కూడా ఉంది. అయితే.. మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో కనిపించిన సినిమా ఇదొక్కటే.

మరిన్ని..

మొలతాడుకు మగవారికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

కాంగ్రెస్ తరపున నాటు నాటు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పోటీ.. ఆ నియోజకవర్గం నుంచేనా ?

స్కంద ప్రీ రిలీజ్ వేడుకలో బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. దర్శకులు ఆ విషయంపై దృష్టి సారించాలి..!

Visitors Are Also Reading