Home » మహా శివరాత్రి ఎప్పుడు వచ్చింది…? జాగరణకి ఎందుకు అంత ప్రాముఖ్యత..?

మహా శివరాత్రి ఎప్పుడు వచ్చింది…? జాగరణకి ఎందుకు అంత ప్రాముఖ్యత..?

by Sravya
Ad

హిందువుల జరుపుకునే పండగల్లో మహాశివరాత్రి కూడా ఒకటి. ఆ రోజు శివాలయాలు మొత్తం శివనామస్మరణతో మారుమొగిపోతాయి. శివ భక్తులు జరుపుకునే ముఖ్య పండుగ మహాశివరాత్రి. ఈసారి మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది…? జాగారం ప్రత్యేకత ఏంటి మొదలైన విషయాలను తెలుసుకుందాం. ప్రతినెలా బహుళ చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తుంది. శివుడికి కార్తీక మాసం అంటే ఎంతో ఇష్టం మహాశివరాత్రి మాఘ బహుళ చతుర్దశి రోజు వస్తుంది. ఈ ఏడాది శివరాత్రి మార్చి 8న వచ్చింది.

Advertisement

Advertisement

మార్చి 8 రాత్రి 8 గంటల 13 నిమిషాల వరకు త్రయోదశి ఉంటుంది తర్వాత చతుర్దశి మొదలవుతుంది. శివరాత్రి రోజు శివుడిని ఆరాధించి ఉపవాసం చేస్తారు. అలానే శివార్చన చేస్తూ జాగారం చేస్తారు. శివ అంటే మంగళకరం శుభప్రదం అని అర్థము. ఉపవాసం చేసి తర్వాత రోజు మాంసాహారం గుడ్లు మద్యం వంటివి తీసుకోకూడదు. శివరాత్రి నాడు జాగరణ చేస్తే సంపదలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. శివరాత్రి తర్వాత రోజు శివాలయాన్ని దర్శించి ప్రసాదం తీసుకొని ఉపవాస వ్రతం విరమించాలి. శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేసిన వాళ్ళు మరుసటి రోజు రాత్రి దాకా నిద్రపోకూడదు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading