Home » Maharaja Review: మహారాజ కథ, రివ్యూ అండ్ రేటింగ్..!

Maharaja Review: మహారాజ కథ, రివ్యూ అండ్ రేటింగ్..!

by Sravanthi
Ad

Maharaja Review : మహారాజ సినిమాలో విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, అభిరామి, భారతీరాజా తదితరులు నటించారు. ఈ సినిమాకి నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించగా సుదన్ సుందరం, జగదీష్ పళనిసామి నిర్మించారు. B అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందించారు.

maharaja

Advertisement

నటులు: విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, అభిరామి, భారతీరాజా తదితరులు
సంగీతం: B అజనీష్ లోకనాథ్
దర్శకుడు: నితిలన్ స్వామినాథన్
నిర్మాత: సుదన్ సుందరం, జగదీష్ పళనిసామి
రిలీజ్ డేట్: 14-06-2024

కథ మరియు వివరణ:

మహారాజా (విజయ్ సేతుపతి) భార్య చనిపోతారు. ఆ తరవాత ఆటను కూతురు జ్యోతితో కలిసి ఒక సెలూన్ షాప్ నడుపుతూ ఆమెని చూసుకుంటూ ఉంటాడు. చిన్నప్పుడు ఆక్సిడెంట్ లో తన భార్య చనిపోతుంది. ఓ ఇనుప చెత్త బుట్ట కూతురు ప్రాణాలను కాపాడుతుంది. అందుకు దానికి లక్ష్మీ అని పేరు పెట్టి ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. కూతురు స్పోర్ట్స్ క్యాంప్ కి వెళ్తుంది. ఆమె వెళ్లిన తరవాత మహారాజా చెత్తబుట్ట పోతుంది. ఎలా అయినా ఆమె వచ్చేలోపు ఆ చెత్తబుట్ట రావాలని అనుకుంటాడు. దొరికి పెట్టమని పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇస్తాడు. చెత్తబుట్ట పోవడం ఏంటని పోలీసులు తిట్టినా దొరికేదాకా అక్కడే ఉంటానని ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తానని చెప్తాడు. దీంతో పోలీసులు ఒక డూప్లికేట్ చెత్తబుట్ట కోసం ట్రై చేస్తారు.

Advertisement

సెల్వం (అనురాగ్ కశ్యప్) తన స్నేహితుడితో దొంగతనాలు చేస్తూ ఉంటాడు సెల్వంకు మహారాజకు సంబంధం ఏంటి..? చెత్తబుట్ట దొరికిందా..? పోలీసులు ఏం చేస్తారు..? స్పోర్ట్స్ క్యాంప్ కి వెళ్ళాక కూతురు తిరిగి వచ్చిందా ఇవాన్నీ తెలియాలంటే సినిమాను చూడాల్సిందే. మూవీ మొదటి పార్ట్ అంతా మహారాజా గురించి, అతని చెత్తబుట్ట కథ గురించి చూపిస్తూ కామెడీని పండించారు. సెకండ్ హాఫ్ మొదట్లోనే కథ అర్థమైంది. ట్విస్టులు రివిల్ చేస్తూ వస్తుండడంతో సెకండ్ హాఫ్ మధ్యలోకి వచ్చాక క్లైమాక్స్ అందరికీ అర్థం అయిపోయింది. ఈ మూవీ స్క్రీన్ ప్లే బాగుంది అనిపించినా కథ మామూలుగానే వుంది. అయితే చివర్లో ఎమోషన్ బాగుంది.

Also read;

విజయ్ సేతుపతి 50వ సినిమా ఇది. ఆయన ఇలాంటి మామూలు మధ్యతరగతి తండ్రి కథ ఎంచుకోవడం విశేషం. విజయ్ సేతుపతి సూపర్బ్ గా తన రోల్ చేసారు. తమిళ యువ హీరోయిన్ దివ్యభారతి గెస్ట్ పాత్రలో కనపడ్డారు. సెల్వంగా అనురాగ్ కశ్యప్ ఇంకో సారి విలనిజాన్ని పండించారు. సెల్వం భార్య పాత్రలో అభిరామి బాగా నటించారు. ఈ మూవీ స్క్రీన్ ప్లే ప్లస్ అయింది సరికొత్త స్క్రీన్ ప్లే తో అద్భుతంగా రాశారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా సూపర్బ్ గా వున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.

Also read:

ప్లస్ పాయింట్స్:

విజయ్ సేతుపతి నటన
ఎమోషన్స్
కథ

మైనస్ పాయింట్స్:

సాగుతీత సన్నివేశాలు
ముందే అర్థమైన ట్విస్టులు

రేటింగ్: 3/5

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading