Home » Maha Shivaratri 2024: wishes, Quotes in Telugu మహాశివరాత్రి విషెస్ అండ్ కోట్స్..!

Maha Shivaratri 2024: wishes, Quotes in Telugu మహాశివరాత్రి విషెస్ అండ్ కోట్స్..!

by Sravya
Ad

MMaha Shivaratri 2024: wishes, Quotes in Telugu : హిందువులందరూ కూడా మహాశివరాత్రి నాడు శివుడిని ప్రత్యేకించి ఆరాధిస్తూ ఉంటారు. మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ. శివపార్వతుల వివాహం జరిగిన రోజు ఇది. ఈరోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు పంచాంగం ప్రకారం ఈసారి మహాశివరాత్రి మార్చి 8న వచ్చింది. ప్రతి ఏటా శీతాకాలం చివర్లో వేసవికాలం ముందు వచ్చే మాఘ మాసంలో మహాశివరాత్రి వస్తుంది. మహాశివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుందట ప్రతి ఏటా మాగ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు ఇది వస్తుంది. ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించారు శివుడు అని శివపురాణంలో చెప్పబడింది.

big festival of god shiv, maha shivaratri

సంవత్సరంలో 12 శివరాత్రుల్లో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనది శివరాత్రి నాడు బిల్వ ఆకులు శివుడికి సమర్పిస్తే ఎంతో మంచి జరుగుతుంది. రోజంతా ఉపవాసం చేసి రాత్రి అంతా జాగరణ చేస్తారు శివ భక్తులు. శివ భక్తులకు అత్యంత పర్వదినం ఇది. శివ భక్తుల తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజలు చేస్తారు ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణ చేసి మరునాడు భోజనం చేస్తారు. రాత్రంతా శివ పూజలు అభిషేకాలు అలానే అర్చనలు వంటివి జరుపుతారు.

Advertisement

అన్ని శివ క్షేత్రాలలో కూడా ఉత్సవాన్ని ఘనంగా జరుపుతారు పూర్వం శ్రీశైలం క్షేత్రంలో జరిగే ఉత్సవాలు పాలకూరికి సోమనాథుడి పండితారాధ్య చరిత్రలో క్లుప్తంగా చెప్పారు. తపస్సు యోగా ధ్యానం అంటే అభ్యాసంతో క్రమంగా జీవితం యొక్క అత్యాధునిక మనిషిని చేరడానికి ముక్తిని పొందడానికి దీనిని నిర్వహిస్తారు.

Advertisement

Maha Shivaratri Wishes 2024  శివరాత్రి నాడు శివుని అనుగ్రహం ఇలా పొందండి:

బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగం
జన్మజ దు:ఖ వినాశక లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం.. మహాశివరాత్రి శుభాకాంక్షలు

వందే శంభుముమాపతిం సురుగురుం వందే జగత్కారణం..
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం..
వందే సూర్యశశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం..
వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం – శివరాత్రి శుభాకాంక్షలు

శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం.. శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం.. నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే.. నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి… మహాశివరాత్రి శుభాకాంక్షలు..

భీమా శంకరా.. ఓం కారేశ్వరా.. శ్రీకాళేశ్వరా.. మా ఎములాడ రాజరాజేవ్వరా.. మమ్మేలే మా ప్రాణేశ్వరా.. మా రక్ష నీవే ఈశ్వరా.. మహా శివరాత్రి శుభాకాంక్షలు..

ఏమీ అర్థం కానివారికి పూర్ణలింగేశ్వరం.. అంతో ఇంతో తెలిసినవారికి అర్ధనారీశ్వరం శరణాగతి అన్నవారికి మాత్రం ఆయనే సర్వేశ్వరం.. మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు..

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading