Home » లవర్ మాట్లాడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి..కట్ చేస్తే…!

లవర్ మాట్లాడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి..కట్ చేస్తే…!

by Ajay

ప్రేమ ఎంత‌టి వారినైనా పిచ్చివాళ్ల‌ను చేస్తుంది. అప్ప‌టివ‌ర‌కూ ఎంతో హ్యాపీగా ఉన్న‌వాళ్లు ప్రేమ‌లో ప‌డ‌గానే త‌మ లోకం మారిపోతుంది. ఎప్పుడూ ప్రేమించిన‌వారితో బిజీగా ఉంటారు. ఇక ప్రేమించిన వారితో ఒక్క‌రోజు మాట్లాడ‌లేక‌పోతే కొంప‌లు అంటుకున్న‌ట్టు ఫీల్ అయిపోతారు. వారితో మాట్లాడేందుకు ఏం చేయ‌డానికైనా రెడీ అయిపోతారు.

Lover requests police

అలా ప్రేమ‌లో మునిగి తేలుతున్న ఓ యువ‌తి త‌న ల‌వ‌ర్ మాట్లాడ‌టం లేద‌ని ఏకంగా పోలీసుల‌కే ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే….మ‌ధ్యప్రదేశ్ లోని చింద్వారా ప్రాంతానికి చెందిన మ‌హిళ స‌ర‌ణి ప్రాంతానికి చెందిన ఓ వ్య‌క్తితో రిలేష‌న్ షిప్ లో ఉంది. కాగా త‌న పుట్టిన రోజు ప్రేయ‌సి శుభాకాక్ష‌లు చెప్ప‌లేద‌ని ప్రియుడు అలిగాడు. దాంతో ఆమెతో మాట్లాడ‌టం మానేశాడు. దాంతో ఇద్ద‌రి మ‌ధ్య వివాదం నెల‌కొంది. నా కంటే నీకు వేరెవ‌రో ఎక్కువ అయిపోయారు క‌దా అని ప్రియుడు త‌న ప్రియురాలితో మాట్లాడ‌టం మానేశాడు. ఎంత ప్ర‌య‌త్నించినప్ప‌టికీ త‌న ల‌వ‌ర్ మాట్లాడ‌క‌పోవ‌డంతో ప్రియురాలు ఏకంగా పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

Marriage

Marriage

ఎలాగైనా త‌మ మ‌ధ్య మాట‌లు క‌ల‌పాల‌ని పోలీసుల‌ను వేడుకుంది. దాంతో త‌ల‌ప‌ట్టుకున్న పోలీసులు ఇద్ద‌రినీ క‌లిపేందుకు ప్రియుడిని పోలీస్ స్టేష‌న్ కు ర‌ప్పించారు. అక్క‌డ ఇద్ద‌రినీ కూర్చోబెట్టి న‌చ్చ‌జెప్పారు. అంతే కాకుండా అత‌డిని యువ‌తితో పెళ్లికి కూడా పోలీసులు ఒప్పించారు. ఇరు కుటుంబ స‌భ్యుల‌ను సైతం పిలిపించి మాట్లాడారు. అలా పోలీసుల చొర‌వ‌తో ఇద్ద‌రి మధ్య రాజీ కుదిరింది. అంతే కాకుండా ఇద్ద‌రికీ పోలీసులు ఆర్య స‌మాజ్ లో వివాహం కూడా జ‌రిపించారు. దాంతో ఆ జంట హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయారు.


You may also like