Home » సింహంతోనే వెక్కిలి వేషాలు.. చివరికి వేలు పోగొట్టుకొని లబోదిబోమన్నాడు..!

సింహంతోనే వెక్కిలి వేషాలు.. చివరికి వేలు పోగొట్టుకొని లబోదిబోమన్నాడు..!

by Sravanthi Pandrala Pandrala
Ad

సాధారణంగా క్రూర మృగాలను మనం చూస్తేనే కిలోమీటర్ల దూరం పారిపోతాం. ఎందుకంటే అవి ఏ విధంగా దాడి చేసేది మనకు తెలియదు. అవి దాడి చేశాయి అంటే చచ్చేదాకా వదలవు. అలాంటి వాటి జోలికి తెలిసిన వ్యక్తి ఎవరైనా పోతారా.. పోవడమా వాటిని చూస్తేనే హడలెత్తి పోతాం. సాధారణంగా మనకు ఎక్కడైనా జూకి వెళ్ళినప్పుడు వాటిని దూరం నుంచి చూస్తూ ఉంటే అవి విపరీతంగా గాండ్రింస్థాయి. అలాంటి సమయంలో చిన్న పిల్లలు భయపడుతూ ఉంటారు. అంతటి క్రుర జంతువులతో వెక్కిలి వేషాలు వేస్తే ఊరుకుంటాయా.

Advertisement

కర్రు కాల్చి వాత పెట్టినట్టు చేస్తాయి.. అలాంటి ఓ సంఘటన జరిగింది.. మరి అది ఏంటో పూర్తి వివరాలు తెలుసుకుందాం..? జమైకా సెయింట్ ఎలిజబెత్ లో ఉన్నటువంటి ఒక జూలో అక్కడి సిబ్బందిలో ఒక వ్యక్తి సింహంతో ఆట ఆడుతున్నాడు. నన్ను అదేం చేస్తుందిలే అని చాలా సింపుల్ గా తీసుకున్నాడు. అతని చేతి వేళ్లను సింహం నోట్లో పెట్టి ఆటలాడాడు. కానీ సింహంతో ఆటలాడితే ఊరుకుంటుందా.. అతని వేళ్ళలో ఒక వేలును గట్టిగా నోటకరచుకొని బిర్యానీ తిన్నట్టు తినేసింది.

Advertisement

దీంతో ఆ వ్యక్తి నొప్పితో లబోదిబో మన్నాడు. అది బోనులో ఉన్నది కాబట్టి అతని వేలి వరకే తిన్నది, లేదంటే చాలా పెద్ద అనర్థమే జరిగి ఉండేది కావచ్చు. అయితే ఈ సంఘటన అంతా జూకు వచ్చిన కొంతమంది చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సందర్భంలోనే ఆ వ్యక్తిని చాలా మంది కామెంట్ తో విమర్శిస్తున్నారు. సింహంతో ఆట లాడితే ఇలాగే ఉంటుందని అంటున్నారు నెటిజన్లు.

also read;

సార్ నా భార్యను అరెస్ట్ చేయండి.. పోలీస్ స్టేషన్ ముందు నిరసన.. కారణం ఏమిటంటే?

ఈ లేడీ ప‌వ‌ర్ స్టార్ కు క్రేజీ మామూలుగా లేదుగా.. ఆమె మైక్ ప‌ట్ట‌గానే ఓ రేంజ్ లో..!

 

Visitors Are Also Reading