తెలుగు చిత్రపరిశమలో తన మన అనే భేదం కనిపించదు. ఏ ఇండస్ట్రీకి చెందిన సినిమా అయినా ప్రేక్షకులకు నచ్చిందంటే కలెక్షన్ ల వర్షం కురుస్తుంది. సినిమా బాగుంటే థియేటర్ లు కూడా దొరుకుతాయి. కన్నడ ఇండస్ట్రీకి చెందిన కేజీఎఫ్ సినిమాకు ఇక్కడ కలెక్షన్ ల వర్షం కురిసింది. అంతే కాకుండా కాంతార సినిమాను కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించారు.
ALSO READ : ఇండియాలో ఫేస్బుక్, ఇన్ స్టా బ్లూటిక్ కు చార్జీలు… నెలకు ఎంత అంటే?
Advertisement
కేవలం కన్నడ సినిమా అనే కాకుండా తమిళ, హిందీ ఇలా ఏ బాషీయ సినిమా అయినా ఇండస్ట్రీకి చెందినవారు మరియు ప్రేక్షకులు వివక్ష అస్సలు చూపించరు. అయితే తెలుగు సినిమా పై మాత్రం తమిళ చిత్ర పరిశ్రమ వివక్ష చూపించినట్టుగా ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళులకు ప్రాంతీయ భాషీయ అభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే అది సినిమాల విషయంలో కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
Advertisement
ఇటీవల విజయ్ హీరోగా నటించిన వారసుడు సినిమాను తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించినప్పటికీ స్ట్రెయట్ తమిళ్ సినిమా అని ప్రచారం చేశారు. అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 160 థియేటర్ లలో విడుదలైంది.
అయితే తాజాగా నాని హీరోగా నటించిన దసరా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేశారు. అయితే ఈ సినిమాకు తమిళనాట కేవలం 80 థియేటర్ లు మాత్రమే ఇచ్చారు. దాంతో నాని సినిమా కలెక్షన్ లను తగ్గించడానికే తమిళనాట కుట్ర జరుగుతోంది అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
ALSO READ : Nagarjuna – Lakshmi : నాగార్జున-లక్ష్మీల అలనాటి ఫోటో వైరల్…!