చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటి వరకు చాలామంది ప్రముఖ దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలామంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంతమంది మరణిస్తే, మరికొంతమంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది.
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తాజాగా కన్నుమూశారు. ఫిల్మ్ నగర్ లోని నివాసంలో తుది శ్వాస విడిచారు కైకాల సత్యనారాయణ. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల ఇవాళ ఉదయం నాలుగు గంటలకు మరణించినట్లు సమాచారం అందుతోంది. తెలుగు తెరపై ఒకదానితో ఒకటి సంబంధం లేని పాత్రలతో విలక్షణమైన నటనతో నవరస నటన సార్వభౌముడు అనిపించుకున్నారు సత్యనారాయణ.
Advertisement
Advertisement
మహానటుడు ఎస్వి రంగారావు నట వారసుడిగా తెలుగు సినిమా స్వర్ణయుగ చరిత్రలో ఆయనకంటూ ఒక అధ్యాయాన్ని సృష్టించుకున్న విలక్షణ నటుడు. దాదాపు 6 దశాబ్దాల సుదీర్ఘ సిని ప్రస్థానంలో దాదాపు 777 చిత్రాల్లో పలు విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించారు కైకాల సత్యనారాయణ. తెరపై తండ్రి పాత్రలైనా, పాత పాత్రలైనా, పతి నాయకుడు పాత్రలోనైనా, హాస్యనటుడిగా ఇలా అన్ని పాత్రల్లో తనదైన నటనతో ఆకట్టుకొని నవరస నటన సార్వభౌముడిగా తెలుగు తెరను ఏలారు. ఇక ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు.
READ ALSO : వేణు స్వామి చెప్పినట్టే నయనతార జీవితంలో సమస్యలు మొదలయ్యాయా..?