నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఆ సినిమా కంటే ముందు బాలయ్యకు వరుసగా ఆరుప్లాప్ లు పడ్డాయి. అలాంటి సమయంలో బోయపాటి బాలయ్య నుండి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అదే చూపించి సూపర్ హిట్ ఇచ్చాడు. ఆ తరవాత వీరిద్దరి కాంబినేషన్ లో లెజెండ్ సినిమా వచ్చింది. ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా మాస్ ఆడియన్స్ కు పూకాలు తెప్పించింది.
Advertisement
ఈ సినిమా తరవాత బాలయ్య ఫుల్ బిజీ అయ్యారు. ఇక ఇదే సినిమాతో జగపతిబాబు విలన్ గా పరిచయం అయ్యాడు. అంతే కాకుండా విలన్ గా ఉగ్రరూపం ప్రదర్శించాడు. అయితే ఈ సినిమాకు తెరవెనక చాలా కథ జరిగింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం….ఈ సినిమాలో మొదట హీరోయిన్ లుగా అంజలి మరియు జెన్నీఫర్ ఫెర్నాండేజ్ ను అనుకున్నారు. కానీ ఆ తరవాత హీరోయిన్ గా రాధిక అప్టేను సెలక్ట్ చేశారు.
Advertisement
సోనాల్ చౌహాన్ ను కూడా తీసుకున్నారు. ఇక సినిమాలో విలన్ కోసం చాలా పేర్లను పరిశీలించారు. తమిళ్ స్టార్ విలన్ పేరును సైతం పరిశీలించారు. ఆ తరవాత జగపతి బాబు అయితే సూపర్ గా ఉంటుందని అనుకున్నారట. అయితే మొదట జగపతి బాబు విలన్ గా నో చెప్పారట. కానీ ఆ తరవాత విలన్ గా నటించేందుకు ఓకే చెప్పారట. తనకు హీరోగా అవకాశాలు తగ్గుముకం పట్టాయని అంతే కాకుండా బాలయ్య హీరోగా నటిస్తున్నారని జగపతి బాబు ఓకే చెప్పారట.
మొదట జగపతి బాబుకు భార్యగా రమ్యకృష్ణను అనుకున్నారు. కానీ ఆ తరవాత కల్యాణిని ఎంపిక చేశారు. ఈ సినిమాకు మొదట జై సింహా అనే టైటిల్ ను అనుకున్నారు కానీ ఆ తరవాత లెజెండ్ గా మార్చారు. ఇక 2014లో విడుదలైన ఈ సినిమా అద్భతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. బాలయ్య వన్ మ్యాన్ షోతో ఆడియన్స్ కు మాస్ బిర్యానీ పెట్టారు.