పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా పాలిటిక్స్ కే సమయం కేటాయిస్తున్నారు. ఓవైపు రాజకీయాల్లో ఉంటూనే, మరోవైపు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ మధ్యనే హరిశంకర్, సుజిత్ ల సినిమాలు పూజా కార్యక్రమాలతో ప్రారంభించాడు. హరిశంకర్ తో చేయబోయే సినిమా ‘తేరి’ రీమేక్ అని తెలుస్తుంది. ఇక సుజిత్ దర్శకత్వంలో చేయబోయేది ‘ఓజి’ అనే గ్యాంగ్ స్టర్ డ్రామా కావడం విశేషం.
Advertisement
అయితే, తాజాగా లయ పవన్ కళ్యాణ్ తన పెళ్లికి వచ్చారని గుర్తు చేసుకున్నారు. లయ 2006లో డాక్టర్ శ్రీ గణేష్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తన పెళ్లికి చిరంజీవి, పవన్ కళ్యాణ్ ని పిలుద్దామని వెళ్లారట. కానీ లయకు వారి అపాయింట్మెంట్ లేదు. కానీ వెళ్లిందట. దీంతో ఆయన వెంటనే రమ్మన్నారు. చాలాసేపు మాట్లాడారు. ఇన్విటేషన్ తీసుకున్నారు. రండి అని అన్నాను. తప్పకుండా వస్తాను అని అన్నారని లయ తెలిపింది.
Advertisement
అలానే అంటారు, రారు అనుకున్నా. కానీ అందరికంటే ముందు, జస్ట్ ల కంటే ముందు పవన్ కళ్యాణ్ వచ్చారు. చాలా సింపుల్ గా ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా వచ్చారని, వస్తున్నారన్న సమాచారం కూడా ఇవ్వలేదని లయ తెలిపారు.
ఆయన్ని బాగా రిసీవ్ చేసుకుని ఏర్పాట్లు చేయడానికి కూడా ఆయన అవకాశం, ఇవ్వలేదని, సడన్ గా వచ్చేసారని అన్నారు. ‘అన్నయ్యని పిలిచావు కదమ్మ, అన్నయ్య కూడా వస్తున్నారు. ఆన్ ద వే ఉన్నారు. వస్తున్నారు’ అని పవన్ కళ్యాణ్ అన్నారని ఆయన గుర్తుచేశారు. ‘థాంక్యూ సో మచ్ సార్, భోజనం చేసి వెళ్ళండి’ అని లయ అంటే, ఆయన నవ్వి భోజనం చేయాలమ్మ, తర్వాత చూద్దామంటూ నవ్వుకుని వెళ్లిపోయారని లయ అన్నారు. ఈ రకంగా పవన్ కళ్యాణ్ నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని పేర్కొంది లయ.
read also : NTR “కొండవీటి సింహం”లో చిరును తప్పించి.. మోహన్ బాబుకు ఛాన్స్…దీనికి అసలు కారణం ఇదే!