నందమూరి తారకరత్న… నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే చిత్తూరు లోని హాస్పిటల్ కి తరలించి.. ఆతరువాత బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. దాదాపు 23 రోజుల పాటు తారకరత్న చికిత్స తీసుకున్నారు. ఫిబ్రవరి 18న శివరాత్రి పండుగ రోజే తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లారు. అయితే, తారకరత్న మృతిపై తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతీ సంచలన ఆరోపణలు చేశారు. తారకరత్న మృతి చాలా బాధాకరమైన విషయం అని అంటూనే తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు చేశారు.
Advertisement
Advertisement
లోకేష్ పాదయాత్రకు, లోకేష్ కు చెడ్డ పేరు వస్తుందని తారకరత్న మరణవార్తను ఇన్నాళ్లు చంద్రబాబు దాచారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను తమ స్వార్థ రాజకీయం కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారని అన్నారు. రెండు రోజులు పాదయాత్ర వాయిదా వేసినప్పుడే మరణవార్త అప్పుడే ప్రకటించి ఉండాల్సిందని అన్నారు. ప్రజలు అవశకునంగా భావిస్తారని ఇన్నాళ్లు డ్రామా చేశారని అన్నారు.
రాష్ట్రానికే నాన్న కొడుకులు అపశకునం అని ప్రజలకు తెలుసని వ్యాఖ్యలు చేశారు.గుండె ఆగిపోయిన నాడే డాక్టర్లు చెప్పారు. తారకరత్న బతకడం చాలా కష్టమని, భారతరత్న భార్య బిడ్డలను, తల్లిదండ్రులను చంద్రబాబు మానసిక క్షోభకు గురిచేశారు. నీచమైన రాజకీయాలు నారా కుటుంబం చేయడం ఆపేస్తే, మా నందమూరి కుటుంబం బాగుపడుతుందని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు.
Read Also : నందమూరి తారకరత్న అరుదైన చిత్రాలు