Home » పెళ్లికి ముందే వరుణ్ తేజ్ కు లావణ్య కండిషన్స్..అవి ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

పెళ్లికి ముందే వరుణ్ తేజ్ కు లావణ్య కండిషన్స్..అవి ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

by AJAY
Published: Last Updated on
Ad

రీసెంట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాదులో వీరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఇప్పటివరకు చాలామంది సెలబ్రిటీలు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కానీ లావణ్య వరుణ్ మాత్రం గుట్టు చప్పుడు కాకుండా ప్రేమించుకున్నారు. వీరికి సంబంధించిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వలేదు.

lavanya-thripati

Advertisement

 

చాలామంది తారలు ప్రేమించుకున్నారు అయితే వారి ఫోటోలు పెళ్లికి ముందే హోటల్స్ లో లేదా ఇతర వెకేషన్ లో లీకై వైరల్ అయ్యాయి. కానీ లావణ్య వరుణ్ విషయంలో అలా జరగలేదు. ఇక వీరిద్దరూ కలిసి మిస్టర్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడినట్టు ప్రచారం జరుగుతుంది.

Advertisement

ఆ తర్వాత లావణ్య వరుణ్ కలిసి మరో సినిమాలో కూడా నటించారు. అంతేకాకుండా ఇద్దరూ ఇటలీలో డేటింగ్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు మరో వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఏంటంటే హీరోయిన్ లావణ్య వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకోవడానికి ఒక కండిషన్ ను పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ కండిషన్ ఏంటంటే లావణ్య త్రిపాఠి కి భరతనాట్యం అంటే చాలా ఇష్టం.

అయితే పెళ్లి తర్వాత కూడా తాను స్టేజ్ పై డాన్స్ చేసే ఛాన్స్ వస్తే భరతనాట్యం చేస్తానని లావణ్య చెప్పారట. అదే విధంగా పెళ్లి తర్వాత సినిమాలలో నటించకపోయినా.. ప్రొడక్షన్ వైపు వెళతానని లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కు చెప్పారట. ఈ రెండు కండిషన్స్ కు వరుణ్ తేజ్ తో పాటు అతడి ఫ్యామిలీ కూడా ఒప్పుకుందట. ఆ తర్వాతే లావణ్య పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చదవండి !

Visitors Are Also Reading