పార్లమెంట్ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కొనసాగుతోంది. దొరికిన ఆరుగురు నిందితులని విచారిస్తున్నారు. పార్లమెంట్ పై దాడికి పాల్పడ్డ సాగర్ శర్మ, మనోరంజన్, నీలం, ఆమోల్ షిండే, విక్కీశర్మ, అతని భార్యని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. లలిత్ ఝా ప్రధాన సూత్రధారి అని అర్ధమవుతోంది. పోలీసుల నుండి తప్పించుకుని రాజస్థాన్‌లో తలదాచుకున్నట్లు వార్తలయితే వచ్చాయి. రాజస్థాన్‌లో ఇతని కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు లలిత్ ఝా ఢిల్లీలోని పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. పార్లమెంట్ మీద దాడి చేశాక బస్సులో రాజస్థాన్‌లోని నాగౌర్‌కు వెళ్లి ఒక హోటల్లో ఉన్నారట. అలాగే పార్లమెంట్ బయట జరిగిన తతంగాన్ని మొత్తం వీడియో తీసి కోల్‌కతాలో నీలక్ష్ ఐష్‌కు పంపాడు. నీలక్ష్ ఐష్ కలకత్తా లో ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారు.
Advertisement
Advertisement
పార్లమెంట్ దాడి పై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి పక్కా ప్లాన్ ప్రకారమే దాడి చేసినట్లు నిందితుడు చెప్పాడు. ప్రత్యేక బృందం ఇప్పటికే కోల్కత్తా వెళ్ళింది. పార్లమెంట్ దాడిపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పక్కాప్లాన్ ప్రకారమే దాడికి పాల్పడ్డట్లు తెలిసింది. ప్రధాని మిస్సింగ్ అని ముద్రించిన కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సంఘ విద్రోహ శక్తులు దీని వేణుకు వున్నయామో అన్న అనుమానం వ్యక్త పరిచారు.
నిందితులను ముంబై, మైసూర్, లక్నో తీసుకెళ్లి విచారించాల్సిన వుంది. ప్రధానిని కనిపెట్టినవారికి స్విస్ బ్యాంక్ నుంచి నగదు బహుమతి అని ప్రకటన ఇవ్వాలని ముందుగా పాంప్లెట్లను ప్రింట్ చేసారు. పోలీసులు వీటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది ఇలా ఉంటే పార్లమెంట్లో అనుచితంగా ప్రవర్తించినందుకు 14 మంది ఎంపీలు ని సస్పెండ్ చేసారు. ఒక రాజ్యసభ ఎంపీతో పాటు 13 మంది లోక్‌సభ ఎంపీలపై చర్యలు తీసుకుంది. స్మోక్ అటాక్ ఘటన మీద ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలంటూ విపక్ష ఎంపీలు అన్నారు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!